YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ప్రత్యేక హోదాకు మరో మిత్రపక్షం

Highlights

  • బీహార్ కు ఇవ్వండన్నసీఎం నితీష్ 
ప్రత్యేక హోదాకు మరో మిత్రపక్షం

ప్రత్యేక హోదా అంశం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. హోదా ఇవ్వడానికి ససేమిరా అన్నందుకు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పొత్తును తెగదెంపులు చేసుకుంది. అంతేకాకుండా ఇరు పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుతాల నుంచి బయటకు వచ్చేశారు. విభజన హమీలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ను  నెరవేర్చడం లేదని ఎన్డీఎ తో కటీఫ్ చెప్పింది. ఈ పరిణామం నుంచి బీజేపీ తేరుకోక ముందే..తాజాగా ఎన్డీఎకు చెందిన మరో మిత్రపక్షం (జెడియు) ప్రత్యేక హోదా డిమాండ్ ను  తెరపైకి తెచ్చింది. బీహార్ కు  కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. దీంతో బిజెపి నేతలు షాకయ్యారు. కాగా గతంలో బీహార్ కు   ప్రత్యేక హోదా కోసం నితిష్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
.

Related Posts