YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

టీ20ల్లో యూనివర్సల్ బాస్ మరో విధ్వంసక ఇన్నింగ్స్

టీ20ల్లో యూనివర్సల్ బాస్ మరో విధ్వంసక ఇన్నింగ్స్

 యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో: గేల్ ఇన్నింగ్స్‌ తర్వాత నిలిచిన మ్యాచ్.. ఆఖరికి రద్దు
ఆగస్టు 3 నుంచి వెస్టిండీస్‌తో భారత్ సుదీర్ఘ సిరీస్ మొదలు
ముంబాయి
వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ టీ20ల్లో మరోసారి జూలు విదిల్చాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో వాంకోవర్‌ నైట్స్ తరఫున ఆడుతున్న క్రిస్‌గేల్.. కేవలం 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో ఏకంగా 122 పరుగులు చేశాడు. అయితే.. గేల్ ఇన్నింగ్స్ తర్వాత వర్షం మొదలవగా.. ఆట కొనసాగే అవకాశం లేనందున మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
అంటారియో వేదికగా తాజాగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మాంట్రియల్ టైగర్స్ జట్టు.. వాంకోవర్ టీమ్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో.. ఓపెనర్ వైసీ (51: 19 బంతుల్లో 11x4, 1x6)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన క్రిస్‌గేల్ (122 నాటౌట్: 54 బంతుల్లో 7x4, 12x6) వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ విండీస్ హిట్టర్.. ఆ తర్వాత రెండో వికెట్‌కి వాల్టన్ (29: 18 బంతుల్లో 3x4, 2x6)తో కలిసి 67 పరుగులు, మూడో వికెట్‌కి దుస్సెన్ (56: 25 బంతుల్లో 3x4, 5x6)తో కలిసి అభేద్యంగా 139 పరుగులు చేశాడు.
స్పిన్నర్, పేసర్ అని తేడా లేకుండా.. క్రిస్‌గేల్ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేయడంతో వాంకోవర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 276 పరుగులు చేసింది. టీ20 క్రికెట్‌లో ఇది రెండో అత్యధిక టీమ్ స్కోరుకాగా.. ఈ ఏడాది ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ 278 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే.. వాంకోవర్ జట్టు బ్యాటింగ్ ముగియగానే వర్షం మొదలవగా.. ఆ తర్వాత ఆట కొనసాగే పరిస్థితులు కనిపించకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేశారు.

 

Related Posts