YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇదో అరుదైన అవకాశం..

Highlights

  • నగరంలో విమానాల సందడి
  • వింగ్స్‌ ఇండియా-18 ఉత్సవ్ 
  • నాలుగురోజుల పాటు  ప్రదర్శనలు 
  • విన్యాసాలు.. 
  • బేగంపేట విమానాశ్రయం వేదికగా 
  • శని,ఆదివారం సాధారణ సందర్శకులు 
ఇదో అరుదైన అవకాశం..

ప్రతి రెండేళ్లకోసారి హైదరాబాద్‌లో జరిగే పౌర విమానయాన, ఏరోస్పేస్‌ సదస్సు గురువారం తెలంగాణ  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా   ప్రారంభమైంది. వింగ్స్‌ ఇండియా-18 పేరుతో నాలుగురోజుల పాటు జరిగే ప్రదర్శనకు బేగంపేట విమానాశ్రయం వేదిక నిలిచింది. దీనితో బుల్లి విమానాలు, అంబులెన్స్‌ హెలిక్యాప్టర్లు విమానాశ్రయంలో వరసగా బారులు తీరాయి. అంతేకాకుండా  మార్కెట్లోకి వచ్చే  కొత్త విమానాలను చూసే అరుదైన అవకాశంతో పాటుగా  జాతీయా, అంతర్జాతీయ సంస్థలకు చెందిన  విహంగాలు వీక్షించే భాగ్యం దక్కింది. శని, ఆదివారం సాధారణ సందర్శకులు సైతం వింగ్స్‌ ఇండియా ప్రదర్శనను తిలకించవచ్చు. పాస్‌ ధర రూ.400గా నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శనను తిలకించవచ్చు. ప్రదర్శనలో సందర్శకుల్ని అమితంగా ఆకట్టుకునేవి విమాన విన్యాసాలే. ఈసారి కూడా ఏరోబాటిక్‌ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. విదేశాలకు చెందిన ఏరోబాటిక్‌ పైలెట్లు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేయనున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో కొలువుదీరే బిజినెస్‌ జెట్లు.. నగరవాసులకు కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే ట్రూజెట్‌, గల్ఫ్‌స్ట్రీమ్‌, ఎంబ్రార్‌ తదితర సంస్థలకు చెందిన పది వరకు వ్యక్తిగతంగా వినియోగించే విమానాలు బేగంపేటకు చేరుకున్నాయి. బోయింగ్‌ విమానాలు ప్రత్యేక ఆకర్షణగానిలిచాయి. మూడు కొత్త విమానాలను ఆ సంస్థ ప్రదర్శనాలో ఉంచింది. ప్రదర్శనలో భాగంగా విమానాలతో పాటుగా వాటి సాంకేతికతలు, విడిభాగాల తయారీ, శిక్షణ సంస్థలు తమ 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. తొలి రెండురోజులు కంపెనీల ప్రతినిధులను మాత్రమే అనుమటించారు. వీరి పాస్‌ ధర రూ.2వేలు. శని, ఆదివారం సాధారణ సందర్శకులు సైతం వింగ్స్‌ ఇండియా ప్రదర్శనను తిలకించవచ్చు. పాస్‌ ధర రూ.400గా నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శనను తిలకించవచ్చు.

Related Posts