YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ములుగు సిద్ధాంతిగారి ఆగస్టు పంచాంగం- పండుగలు, ప్రత్యేకతలు

ములుగు సిద్ధాంతిగారి ఆగస్టు పంచాంగం- పండుగలు, ప్రత్యేకతలు

యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:

భారతీయులు గ్రీకేరియన్ క్యాలెండర్ను అనుసరించినా శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే సంప్రదాయ కాలగణన సాధనాన్నే పరిగణనలోకి తీసుకుంటాం. దీన్నే ‘పంచాంగం’ అని అంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం.. పంచ అంగాల కలయిక కాబట్టి దీనిని పంచాంగం అన్నారు. దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు గురించి ఇది తెలియజేస్తుంది. పంచాంగం తయారికి లేదా కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి 'సూర్యమానం', 'చంద్రమానం'. చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ పండితుల పంచాంగాలు మార్కెట్లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్తోపాటు చంద్రమానాన్ని అనుసరించి రోజువారీ, నెలవారీ, వార్షిక పంచాంగాన్ని రూపొందిస్తారు. ములుగు సిద్ధాంతిగారి ఆగస్టు పంచాంగం ప్రకారం ఈ నెలలో పండుగలు, శుభకార్యాలు, తిథులు, దుర్ముహూర్తాలు, వర్జ్యాల గురించి పూర్తి సమాచారం ఉంటుంది. శ్రావణమాసం శుక్లపక్ష పాడ్యమి గురువారంతో ప్రారంభమై భాద్రపద శుక్లపక్ష పాడ్యమి ఆగస్టుతో ముగుస్తుంది. తెలుగు నెలల క్రమంలో ఐదో నెల శ్రావణమాసం ప్రారంభమయ్యేది ఆగస్టు 1నే. పన్నెండు తెలుగు నెలల్లో శ్రావణం ఐదోది.
ఆషాడం మాసం నెల రోజులు పుట్టింట్లో ఉన్న కొత్త కోడలు అత్తవారింటికి శ్రావణంలో వస్తుంది. ఆషాడంలో ఆగిపోయిన శుభకార్యాలు, వివాహాలు శ్రావణంతో తిరిగి మొదలవుతాయి. పూజలు, నోములు, వ్రతాలకు శ్రావణం ప్రత్యేకత. ఈ మాసంలోనే గరుడ పంచమి, వరలక్ష్మి వ్రతం, అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పూర్ణిమ, శ్రీవారి పవిత్రోత్సవాలు, నారాయణగిరిలో ఛత్రస్థాపనం, హయగ్రీవ జయంతి, శ్రీ విఖనస జయంతి, కృష్ణాష్టమి తదితర పండుగలు ఉన్నాయి. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. అత్తవారింట కొత్తకోడలతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. దీని వల్ల సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయిని నమ్మకం.

Related Posts