YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

గ్రూప్ -1 ఎంపికపై  స్టే 

Highlights

  • స్టే విధించిన ఏపీ ట్రిబ్యునల్.
  • ఏపీ ట్రిబ్యునల్ లో  సర్కార్ కి చుక్కెదురు .
  • 15 వరకు రికార్డులు అప్పగింత 
  • తదుపరి విచారణ మార్చి 15 వాయిదా
గ్రూప్ -1 ఎంపికపై  స్టే 

 స్కేలింగ్ విధానం లేకుండా గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు కొనసాగించల్లన్న ప్రభుత్వ నిర్ణయంపై  ఏపీ ట్రిబ్యునల్ స్టే విధించింది.  గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 15 వరకు గ్రూప్‌ 1కు సంబంధించిన  రికార్డులన్ని  ట్రిబ్యునల్ కు సమర్పించాలని  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను  ఏపీ ట్రిబ్యునల్ ఆదేశించింది. స్కేలింగ్ విధానం లేకుండా  ఫిబ్రవరి 25.26 తేదీల్లో ప్రభుత్వం ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంటే కాకుండా బుధవారం  రాత్రి 145 గ్రూప్1 పోస్టులు భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గ్రూప్ వన్ లో తక్కువ మార్కులొచ్చిన ఐదుగురు అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ గ్రూప్1 అభ్యర్థులు మరోసారి ట్రిబునల్ ఆశ్రయించారు. ఈ మేరకు విచారణను చేపట్టిన  ఏపీ ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ నెల 15 కు వాయిదా వేసింది.

Related Posts