YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహిళా బిల్లుకు రాజకీయ విశ్వాసం కావాలి

Highlights

  • బెలూన్లు ఎగురవేసిన మహిళా ఎంపీలు..
  • శుభాకాంక్షలు తెల్పిన ఉప రాష్ట్రపతి
మహిళా బిల్లుకు రాజకీయ విశ్వాసం కావాలి

మహిళా బిల్లుకు ఆమోదం దక్కాలంటే రాజకీయ విశ్వాసం ఉండాల రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి 
 అన్నారు. గురువారం రాజ్యసభలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  చైర్మన్ వెంకయ్యనాయుడు మహిళామణులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత మహిళా ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు బెలూన్లు ఎగరవేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ..మహాత్మా గాంధీ ఆశయాలను ఇంకా తీర్చలేకపోయామని వాపోయారు. పని ప్రదేశాల్లో మహిళలకు అవకాశం దక్కకపోవడం వల్ల ఒకశాతం జీడీపీ కోల్పోతున్నామని ఆమె చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా పెండింగ్ లోనే  ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత అంబికా సోనీ అన్నారు. మేమంతా మహిళలతో కలిసే ఉన్నామని కనీసం తీర్మానం ఎందుకు చేయరని ఆమె ప్రశ్నించారు. సమాన హక్కుల కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని ఎంపీ కుమారి సెల్జా డిమాండ్ చేశారు. పంచాయతీల్లో మహిళలు మెరుగ్గా రాణిస్తున్నారని, అలాగే పార్లమెంట్లోనూ వాళ్లకు అవకాశాలు కల్పించాలని ఎంపీ రజనీ పటేల్ తెలిపారు. రిజర్వేషన్ల వల్లే మహిళలు పంచాయతీల్లో రాణిస్తున్నారని బీజేపీ ఎంపీ సంపతీయ ఉకే అన్నారు. విదేశాంగశాఖ, రక్షణ శాఖలకు మహిళా మంత్రులు ఉన్నట్లు ఆమె గుర్తు చేశారు.మగవాళ్లు మహిళలను తల్లిగా, కూతురిగా, భార్యగా చూస్తుంటారని, కానీ అది అంతం కావాలని, మహిళను మహిళగా చూడాలని ఎండీకే ఎంపీ కనిమొళి అన్నారు. పెళ్లి అయిన తర్వాత మహిళలు ఉద్యోగాలు వదిలేస్తున్నారన్నారు. దళిత, ఆదివాసీ మహిళలకు ప్రతి రోజూ అన్యాయం జరుగుతోందన్నారు. మహిళా బిల్లుకు అన్ని పార్టీలు సపోర్ట్ ఇస్తున్నాయని, కానీ ఆ బిల్లుకు మాత్రం ఆమోదం దక్కడం లేదన్నారు. 

Related Posts