నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో గురువారం మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 220 తగ్గి రూ. 31,450కి చేరింది. అటు వెండి ధర కూడా దిగొచ్చింది. రూ. 400 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 39,500కు పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గినట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. న్యూయార్క్లో బుధవారం నాటి మార్కెట్లో పసిడి ధర 0.70శాతం తగ్గి ఔన్సు ధర 1,324.90డాలర్లు పలికింది. వెండి కూడా 0.53శాతం పడిపోయి ఔన్సు ధర 16.47గా ఉంది.