YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అల్‌-ఖైదా అధినేత బిన్ లాడెన్‌ వారసుడి హతం?

అల్‌-ఖైదా అధినేత బిన్ లాడెన్‌ వారసుడి హతం?

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

బిన్‌ లాడెన్ స్థాపించిన అల్‌-ఖైదాకు వారసుడిగా ఉన్న హమ్జా మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఉగ్రవాదపు ఉక్కుపాదంతో ప్రపంచాన్నే గడగడలాండిచిన అల్‌-ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత బిన్‌ లాడెన్‌ను హతమార్చిన అమెరికా..అతడి కుమారుడు హమ్జా బిన్ లాడెన్‌ను కూడా మట్టుబెట్టినట్లు ఆదేశ మీడియా కథనం వెలువరించింది. గత రెండేళ్లుగా హమ్జా కోసం అమెరికా ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. ఇతడి మృతికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని అమెరికాకు చెందిన ఎన్‌బీసీ వెల్లడించింది. ఇతడి మరణాన్ని అమెరికా అధికారులు కూడా ధ్రువీకరించారని తెలిపింది. 2017లో హమ్జాను ఉగ్రవాదుల లిస్ట్‌లో పెట్టింది. హమ్జాపై ఒక మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఒసామా బిన్‌ లాడెన్‌ 20 మంది పిల్లల్లో హమ్జా 15వ వాడు. అయితే హమ్జా మృతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధ్రువీకరించలేదు. హమ్జా లాడెన్‌ మరణవార్తపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని వెల్లడించారు.2011 మే 2న ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టింది. 2001 సెప్టెంబర్‌ 11న అమెరికా టవర్స్‌ ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పదేళ్ల పాటు  అణువణువు గాలించి లాడెన్‌ను హతమార్చింది. నెఫ్ట్యూన్‌ స్పేర్‌ పేరిట పదేళ్ల పాటు వేట కొనసాగించి 2011లో మే 2న 40 నిమిషాల్లో ముగించారు. లాడెన్ తో సహా అతడి కుమారుడు మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అమెరికాకు చెందిన నేవీ సీల్స్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అబోటా బాద్లోని లాడెన్ నివాసంపై ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేసి.. లాడెన్‌ను నేల కూల్చారు. లాడెన్ చనిపోయిన వెంటనే.. 24గంటలు కూడా గడవకముందే అరేబియా సముద్రంలో పడేశారు.

Related Posts