యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
'మన సత్తా బయటకు రావాలంటే అందుకు తగ్గా అవకాశాలు కూడా రావాలి' అంటోంది కథానాయిక పూజ హెగ్డే. 'మనలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, సరైన అవకాశాలు రాకపోతే ఏమీ చేయలేము. మన టాలెంట్ ఎవరికీ తెలియదు. అందుకే, అవకాశం రావడం ఒక ఎత్తు.. అది వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. అప్పుడే మన టాలెంట్ నలుగురికీ తెలుస్తుంది' అని చెప్పింది పూజ.