Highlights
- సంబల్పూర్ - యశ్వంత్పూర్' మధ్య
- తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
తూర్పు కోస్తా రైల్వే వేసవి సీజన్ లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. సంబల్ పూర్ -బసస్వాది (యశ్వంత్పూర్) మధ్య విశాఖ మీదుగా 13 ట్రిప్పులను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. రైలు నెంబరు 08301 సంబల్పూర్ బనస్వాది (యశ్వంత్పూర్) వీ క్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ సంబల్ పూర్ లో బుధవారం 09.30 గంటలకు వచ్చే నెల (ఏప్రిల్ 4వ తేదీ జూన్ 27వ తేదీ మధ్యలో ప్రయాణాలు సాగించనుంది. విశాఖకు ఈ రైలు 19.00 గంటలకు చేరనుంది. మరలా 19.20 గంటలకు విశాఖలో బయల్దేరి తర్వాతి రోజు బనస్వాదికి 16.04 గంటలకు చేరనుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబరు 08302 బనస్వాదీ (యశ్వంత్పూర్) శుక్రవారాలలో (గురువారం అర్థరాత్రి) 00.30 గంటల మధ్య 06.04.2018 నుంచి 29.06.2018 న విశాఖ గుండా ప్రయాణం చేస్తోంది. సెకండ్ ఏసి 1, థర్డ్ ఎసి 3, స్లీపర్ 10, జనరల్ సెకెండ్ క్లాస్ 2, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ కోచ్లు 2 ఉంటాయి. బర్గార్ రోడ్డు, బొలంగీర్, టిట్లాగర్, కేశంగి, రాయగడ, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేటారు, కృష్ణరాజపురం, మధ్య బనస్వాడి సంబల్ రైలు ప్రయాణం సాగించనుంది.