YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో ఫ్రీ కరెంట్..

ఢిల్లీలో ఫ్రీ కరెంట్..

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సీఎం కేజ్రీవాల్ మరో జనాకర్షక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఢిల్లీలో నివసించే సామాన్యులకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడిన వారికి ఉచితంగా కరెంట్ అందిస్తామని ప్రకటించారు. 201 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. 200 యూనిట్లకు పైగా వాడితే యూనిట్‌కు రూ.3 చొప్పున వసూలు చేస్తారు. ఆప్ సర్కారు నిర్ణయంతో.. నెలకు రూ.600 వరకు ఢిల్లీ వాసులకు ఉపశమనం లభిస్తుంది.  కేజ్రీవాల్ తమ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ఢిల్లీ ప్రజలు 24 గంటలు ఉచిత విద్యుత్‌ను పొందొచ్చన్నారు. నెలకు రూ.250 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి కరెంట్ బిల్లుల భారం 80 శాతం తగ్గుతుందని కేజ్రీవాల్ తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి నూతన టారిఫ్‌ ఆర్డర్‌ను ప్రకటిస్తూ.. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగష్టు 1 నుంచి కొత్త ధరలు వర్తిస్తాయి.

Related Posts