YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు మరోసారి భేటీ

తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు మరోసారి భేటీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని సమస్యలతో పాటు, నీటి పంపకాలపై చర్చించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో త్వరలో చేపట్టనున్న యాగం విశేషాలను జగన్‌తో పంచుకోనున్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాల అజెండాను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నారు. అంతకు ముందు తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను ఆయన కలిశారు. రాజ్ భవన్ లో వీరిద్దరి మధ్య గంటసేపు చర్చలు జరిగాయి. గవర్నర్‌తో భేటీ తర్వాత జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. ఈ భేటీలో ఏపీ భవన్ విభజన, సొంత రాష్ట్రాలకు ఉద్యోగుల బదిలీలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మంచినీటి సమస్యలు, విభజన సమస్యలపై చర్చించినట్లు సమాచారం. వచ్చే నెలలో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీకి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయట. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో త్వరలో చేపట్టనున్న యాగం విశేషాలను జగన్‌కు కేసీఆర్ వివరించారట. విభజన సమస్యలపై చర్చించేందుకే గవర్నర్, కేసీఆర్‌లను జగన్ కలిసినట్లు చెబుతున్నా.. జెరూసలెం పర్యటనకు వెళ్లే ముందు ఇలా ఉన్నట్టుండి ఇద్దర్ని కలవడం ఆసక్తిగా మారింది.కేసీఆర్‌తో భేటీ తర్వాత జగన్ జెరూసలెం యాత్రకు బయిలుదేరారు. హైదరాబాద్ నుంచి ముంబై చేరుకొని అక్కడి నుంచి జెరూసలెం చేరుకున్నారు. జగన్‌తో పాటూ కుటుంబ సభ్యులు కూడా ఈ పర్యటనకు వెళుతున్నారు. ఈ టూర్ పూర్తిగా వ్యక్తిగతమని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఆగష్టు 4 వరకు జగన్ అక్కడే ఉండనున్నారు.. ఈ నెల 5న ముంబై మీదుగా విజయవాడ వస్తారుఇవాళ తన కుటుంబసభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అంతకు ముందు ప్రగతి భవన్‌కు వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.

Related Posts