Highlights
- యుపి నుండి జైట్లీ ..
- ఎంపి నుండి ప్రధాన్
రాజ్యసభకు ఈ నెల 23న జరగనున్న ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థులతో బిజెపి తొలి జాబితాను విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉత్తరప్రదేశ్ నుండి పోటీ చేయనున్నారు. ఆయన ఇప్పటివరకు గుజరాత్ నుండి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బీహార్ నుండి మధ్యప్రదేశ్ మారారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తవర్చంద్ గెహ్లాట్ బీహార్ నుండి పోటీ చేయనున్నారు. ఆరోగ్య మంత్రి జె.పి.నద్దా హిమాచల్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీహార్ నుండి పోటీ చేయనున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుక్ భాయి మాండవీయాలను గుజరాత్ నుండి తిరిగి నామినేట్ చేశారు. గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపి గెలవగలిగే సీట్లు మూడు నుండి రెండుకు తగ్గిపోయాయి, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ రాజస్థాన్ నుండి తిరిగి పోటీ చేయనుండగా, కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ మొదటి జాబితాలో స్థానం దక్కలేదు.