YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చీలికల ద్వారా లబ్ది పొందే పనిలో బీజేపీ

చీలికల ద్వారా లబ్ది పొందే పనిలో బీజేపీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాజ్యసభ…దీనిని ఎగువ సభ అని, పెద్దల సభ అని పిలుస్తుంటారు. రాష్ట్రాల మండలిఅని కూడా వ్యవహరిస్తారు. బ్రిటన్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ప్రతిరూపమే భారతీయ రాజ్యసభ. హౌస్ ఆఫ్ లార్డ్స్ లో వివిధ రంగాల నిపుణులు, మేధావులు ఉంటారు. దీంతో మన రాజ్యసభను పెద్దల సభగా పేర్కొంటారు. పార్లమెంటరీ పరిభాషలో లోక్ సభను దిగువసభ, రాజ్యసభను ఎగువ సభగా పిలుస్తుంటారు. వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు రెండేళ్లకు ఒకసారి ఈ సభ సభ్యులను ఎన్నుకొంటారు. అందువల్ల దీనిని రాష్ట్రాల మండలి అని కూడా వ్యవహరిస్తుంటారు. లోక్ సభ, రాజ్యసభ మధ్య పెద్ద తేడా లేదు. ఒక్క ద్రవ్య బిల్లును మాత్రమే ముందు లోక్ సభ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు.రాజ్యసభలో మెజరిటీ సాధనకు బీజేపీ మరో ఏడాది వేచి చూడక తప్పదు. ఈ ఏడాది ఆఖరులో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తే పార్టీకి మేలు జరుగుతుంది. ఈ మూడు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్యసభకు సభ్యులను ఎన్నుకుంటారు. తద్వారా బలం పెరుగుతుంది. 2020 నవంబరు నాటికి బీజేపీ ఖాతాలో మరో 19 స్థానాలు చేరనున్నాయి. యూపీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశాల నుంచి ఎన్నికయ్యే సభ్యులతో పార్టీ మ్యాజిక్ నెంబర్ అయిన 123ను చేరుతుంది. వీటిల్లో అత్యధిక స్థానాలు యూపీ నుంచి వస్తాయి. అస్సోం నుంచి మూడు, ఒడిశా నుంచి ఒకటి, రాజస్థాన్ నుంచి మూడు, సీట్లు రానున్నాయిమిగిలిన బిల్లులను ఏ సభలో అయినా ప్రవేశ పెట్టొచ్చు. లోక్ సభ సభ్యులను ఐదేళ్లకు ఒకసారి ఎన్నుకుంటారు. అర్థంతరంగా రద్దయితే మధ్యంతర ఎన్నికలను నిర్వహిస్తారు. రాజ్యసభ శాశ్వత సభ. ఇది రద్దు కాదు. రెండేళ్లకొకసారి ఈ సభ సభ్యులను ఎన్నుకొంటారు. పరోక్షంగా ఎన్నికైన రాజ్యసభ కన్నా, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైన లోక్ సభ సభ్యులకే ప్రాధాన్యం ఎక్కువ. లోక్ సభకు ప్రధాని సభా నాయకుడిగా ఉంటారు. రాజ్యసభకు అధికార పార్టీలోని సభ్యుడు నాయకుడిగా వ్యవహరిస్తారు. ప్రసుతం రాజ్యసభ నాయకుడు థాపర్ చంద్ గెహ్లెట్. ఆయన కేంద్ర మంత్రి. రాజ్యసభ సమావేశాలకు ఉప రాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు.డిప్యూటీ ఛైర్మన్ ను ఎన్నుకొంటారు. ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్ హరివంశ బచ్చన్. ఈయన బీహార్ కు చెందిన జనతాదళ్ (యు) నాయకుడు. ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రభుత్వాలకు రాజ్యసభలో తగినంత బలం లేక ఇబ్బందులు ఎదురవ్వడం సహజం. గత 30 ఏళ్లుగా ఢిల్లీ పీఠాన్ని అధిష్టించిన ప్రభుత్వాలన్నీ ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. లోక్ సభలో బలం ఉన్నప్పటికీ రాజ్యసభలో తగినంత బలం లేక బిల్లుల ఆమోదానికి అధికార పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొనడం సహజం. ఇందుకోసం విపక్ష ఎంపీలకు ఆశలు కల్పించడం, ఓటింగ్ కు గైర్హాజరు అయ్యేలా చూడటం, పార్టీల్లో చీలికలు తీసుకురావడం వంటి ఎత్తుగడలకు అధికారపార్టీ పాల్పడుతుంటోంది. ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ చేస్తున్నదిదే. ఏదో రకంగా బిల్లుల ఆమోదానికి, రాజ్యసభలో బలం పెంచుకునేందుకు కమలం పార్టీ ఎత్తుగడలు వేస్తోంది. 2014 లో ఘన విజయం సాధించిన బీజేపీ గత అయిదేళ్లలో రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి ఇబ్బందులు పడింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయదుంధుభి మోగించిన కమలం పార్టీ గత కొద్దిరోజులుగా బిల్లుల ఆమోదానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజ్యసభలో కమలం పార్టీకి పూర్తి మెజారిటీ రావాలంటే మరో ఏడాది ఆగక తప్పదు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ద్వారా కొత్త సభ్యులను ఎన్నుకుని బీజేపీ బలపడుతుంది. కేంద్రంలో అధికారంలో లేనప్పటికీ నిన్న మొన్నటి దాకా రాజ్యసభలో హస్తం పార్టీదే పైచేయి. 245 మంది సభ్యుల గల రాజ్యసభలో బీజేపీ సొంత బలం 78. ఎన్డీఏ కూటమి బలం 102. మెజార్టీ సాధనకు 124 మంది కావాలి. దీంతో ఇటీవల టీడీపీకి చెందని రాజ్యసభ సభ్యుల్లో చీలిక తెచ్చారు. ఆపార్టీకి చెందిన సీఎం రమేష్, టి.జి. వెంకటేష్, సుజనా చౌదరి, గరికపాటి మోహనరావులను పార్టీలో చేర్చుకుంది. యూపీకి చెందిన మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ కు కూడా పార్టీ తీర్థం ఇచ్చేశారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన కొందరు రాజ్యసభ సభ్యులు కూడా త్వరలోనే బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.ప్రాంతీయ పార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ అవసరాన్ని బట్టి మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు ఆమోదంలో ఈ పార్టీలు కీలకపాత్ర పోషించాయి. మొదట ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన టీఆర్ఎస్ తర్వాత తన వైఖరిని మార్చుకుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు స్వయంగా ప్రకటించారు. మొన్నటి దాకా కమలాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన టీఆర్ఎస్ పరోక్షంగా మద్దతు పలికింది. ఓటు వేసేందుకు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్, టీడీపీ ఎంపీ తోట సీతారామలక్ష్మి లను అప్పటికప్పుడు ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. అదే సమయంలో సభలో ఉన్న టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తటస్థంగా ఉండటం విశేషం. బిల్లుపై మూజువాణి ఓటింగ్ జరిగినప్పుడు టీడీపీ ఎటు ఓటు వేసింది తెలియరాలేదు. ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ, ఒడిశాకు చెందిన బీజేడీ కూడా బేషరతుగా బిల్లుకు మద్దతిచ్చాయి. ఈ మేరకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కమలం పార్టీ పెద్దలు చర్చలు జరిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా ఆమోదింపచేసుకుంది.మొత్తానికి రాజ్యసభలో పైచేయి సాధించేందుకు కమలం పార్టీ గట్టి వ్యూహాలను రచిస్తోంది. ఎత్తుగడలు వేస్తోంది. లేదంటే చీలికలు తేవడం ద్వారా రాజ్యసభలో పట్టు సాధించేందుకు కమలం పార్టీ గురిపెట్టింది.

Related Posts