YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ కు మరో బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు 

Highlights

  • హైదరాబాద్ లోని ప్రగతి భవన్ 
  • గజ్వేల్ మరోక నివాసం 
  • రూ. 2 కోట్లు కేటాయింపు
  • మావోయిస్టుల నుంచి కేసీఆర్ కు ముప్పు
  • భద్రతా సిబ్బంది చర్యలు 
     
కేసీఆర్ కు మరో బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మరో బులెట్ ప్రూఫ్ నివాసం సంకురానున్నది. హైదరాబాద్ లో ప్రస్తుతం నివాసం వుంటున్న ఇల్లు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ పరిజ్ఞానంతో నిర్మించారు. దాంతో పాటు  సీఎం కేసీఆర్ కోసం మరో బుల్లెట్ ప్రూఫ్ నివాసం నిర్మాణం కానుందని తెలుస్తోంది. ఓ మ్యాగజైన్ ప్రచురితమైన  కథనం ప్రకారం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలో కేసీఆర్ కోసం ఓ బుల్లెట్ ప్రూఫ్ నివాసం నిర్మించేందుకు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది యోచిస్తున్నట్టు సమాచారం. అందుకోసం తెలంగాణ సర్కార్ నుంచి రూ. 2 కోట్ల నిధులు అదనంగా మంజూరైనట్టుగాను ఆ కథనం పేర్కొంది. ఈ ఇంటికి ఏర్పాటు చేసిన కిటీకీ అద్దాలు, ద్వారాల తలుపుల కోసం మొత్తం బుల్లెట్ ప్రూఫ్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చేపట్టనున్న పర్యటన కోసం కూడా ఓ బుల్లెట్ ప్రూఫ్ బస్సుని సిద్దం చేయనున్నట్టు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి వుంటుందనే అనుమానంతోనే ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Related Posts