YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

అంకెల్లో పెరిగింది - శాతంలో తగ్గింది

అంకెల్లో పెరిగింది - శాతంలో తగ్గింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2018-19 సం. ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ను  రూ.1,91,063.61 కోట్లుగా  ఆర్థికమంత్రి ప్రతిపాదించగా అందులో పాఠశాల విద్యకు 24,180 కోట్లు కేటాయించారు. ఇవి కోట్లలో పెరిగినట్లు కనిపించినా రాష్ట్ర బడ్జెట్‌కు పెరిగిన శాతానికి తగిన విధం విద్యాశాఖకు పెరగలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఆర్‌ఎంఎస్‌ఏ 1233.06, మధ్యాహ్న భోజన పథకంలో 5 గ్రుడ్లు 266 కోట్లు, మోడల్‌ స్కూల్స్‌కు బడ్జెట్‌ 377 కోట్లు, బాలికలకు సైకిళ్ళు 160 కోట్లు, ఉచిత నాప్‌కిన్స్‌ 27 కోట్లు, టాయిలెట్ల మెయింటెనెన్స్‌కు 100 కోట్లు, ఇంటర్మీడియేట్‌లో మధ్యాహ్న భోజనం 23 కోట్లు చొప్పున కేటాయింపులు జరిగాయి. వివిధ పథకాలకు కేటాయింపులు పెరగడం ఆహ్వానించదగిన పరిణామం. 
కాని రాష్ట్ర బడ్జెట్‌ 2017-18 కంటే 2018-2019లో 17.8 శాతం పెరిగింది. విద్యాశాఖకు కేటాయింపు తగ్గింది. కోట్లలో పెరిగినట్లు కనిపించినా పెరిగిన బడ్జెట్‌కనుగుణంగా కేటాయింపు లేవు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి గడిచిన నాలుగేళ్ళలో 2015-16-16.44 శాతం
2016-17-14.84 శాతం
2017-18 -13.65 శాతం
2018-19-13.08 శాతం
కేటాయింపులు చూస్తే రాష్ట్ర బడ్జెట్‌లో తగ్గుతూ వస్తోంది.
2017-18లో పాఠశాల విద్యకు కేటాయించిన 17953.44 కోట్లు 17492 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 460.44 కోట్లు మిగిలిపోయాయి.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. ఇంగ్లీషు మీడియంకు ప్రత్యేకంగా టీచర్లను నియమించాలి.
ఉద్యోగులకు 2014లో పెంచిన 60 సం॥ రిటైర్మెంట్‌, పిఆర్‌సి, హెల్త్‌కార్డులు ఇచ్చినది, సమైకాంధ్ర సెలవుల గురించి చెప్పారు. కాని  ఉద్యోగులంత ఎదరు చూస్తున్న పిఆర్‌సి బకాయిలకు కేటాయింపు లేదు. డిఏలు తగు సమయంలో ఇస్తామంటున్నారు. నూతన పిఆర్‌సి కమిటీ గురించి ప్రస్తావనేలేదు.  సిపిఎస్‌ రద్దు చేయాలని 1,86,000 మంది ఆందోళలను చేస్తుంటే దాని గురించి ప్రస్తావన చేయలేదు.
ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏలాంటి ప్రతిపాదనలు లేకపోవడం అసంతృప్తి కల్గిస్తోంది.
ఆయా సంఘాల డిమాండ్లు..
సిపిఎస్‌ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానించాలి.
పిఆర్‌సి అరియర్స్‌కు బడ్జెట్‌లో కేటాయింపు ఇవ్వాలి. 
11వ పిఆర్‌సి కమిటీని వేయాలి.

Related Posts