Highlights
- ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలన్న నిబంధన ఎత్తి వేత...
- సీఎం కేసీఆర్ వెల్లడి
మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా ఏడాది పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధన తొలగిస్తున్నట్లుతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం వెల్లడించారు.ఈ నిర్ణయం ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని, ఈ ఏడాది పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయకున్నా, వారి విద్యార్హతలను రిజిష్టర్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలినంత సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికనే నియమిస్తున్నందున, మెడికల్ విద్యార్థులతో పని చేయించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు.