YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మరింత తగ్గిన బంగారం ధర

మరింత తగ్గిన బంగారం ధర

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.430 తగ్గుదలతో రూ.36,160కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.230 తగ్గుదలతో రూ.33,150కు క్షీణించింది. బంగారం ధర భారీగా పడిపోతే.. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.44,965 వద్ద స్థిరంగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. దేశీ మార్కెట్‌లో పసిడి ధర తగ్గితే.. గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టింది. పసిడి ధర ఔన్స్‌కు 0.75 శాతం పెరుగుదలతో 1,443.05 డాలర్లకు ఎగసింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుదలతో 16.18 డాలర్లకు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ.35,050కు క్షీణించింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 తగ్గుదలతో రూ.33,850కు దిగొచ్చింది. ఇక కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. రూ.44,965 వద్ద నిలకడగా కొనసాగుతోంది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts