YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాల్లోకి ఆంధ్రా బ్యాంక్‌.. తగ్గిన మొండి బకాయిలు..!!

 లాభాల్లోకి ఆంధ్రా బ్యాంక్‌.. తగ్గిన మొండి బకాయిలు..!!

 యువ్ న్యూస్ జనరల్  బ్యూరో:

ఆంధ్రా బ్యాంక్‌ మళ్లీ లాభాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గాను స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ రూ.51.56 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.539.83 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. కాగా గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు ఏకంగా రూ.1,233.61 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. త్రైమాసిక సమీక్షాకాలంలో మొండి బకాయిలకు చేసిన కేటాయింపులు తగ్గటం బ్యాంక్‌కు కలిసి వచ్చింది. త్రైమాసిక కాలంలో ఆంధ్రా బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.5,092.08 కోట్ల నుంచి రూ.5,437.03 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) స్వల్పంగా తగ్గినట్లు బ్యాంక్‌ పేర్కొంది. మరోవైపు నికర ఎన్‌పీఏలు కూడా 7.96 శాతం నుంచి 5.67 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం కూడా రూ.1,460 కోట్ల నుంచి రూ.1,651 కోట్లకు పెరిగింది.

Related Posts