YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ఉద్యోగం ఇప్పిస్తానని..

Highlights

  • బ్రోతల్ హౌస్కు తరలింపు
  • అదుపులో నిర్వాహకురాలు 
ఉద్యోగం ఇప్పిస్తానని..

అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం దవాఖానలో చేరింది ఓ అభాగ్యురాలు. పక్క బెడ్ మీద ఉన్న మరో రోగి ఆ మహిళ భర్త ఆర్థిక పరిస్థితులను పసిగట్టాడు. మంచి ఉద్యోగమిప్పిస్తానని నమ్మబలికాడు. దవాఖాన నుంచి డిచ్చార్జి కాగానే ఉద్యోగం కోసమని అతను చెప్పిన అడ్రస్ కు  వెళ్లింది. అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను వ్యభిచార రొంపిలోకి దించేందుకు యత్నించారు. వారి నుంచి తప్పించుకుని భర్త సహాయంతో పోలీసులను అశ్రయించింది బాధిత మహిళ. పోలీసులు రంగంలోకి దిగి వ్యభిచార గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో పేరు మోసిన వ్యభిచార గృహా నిర్వాహకురాలితోపాటు సహకరించిన మరో ఐదుగురిని ఆరెస్ట్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ బోయిన్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎస్ ఐ  విజయ కుమార్ కథనం ప్రకారం.. హకీంపేట, సనా హోటల్ సమీపంలో నివసిస్తున్న యండీ మహబూబ్ పాషా(25) .. తన భార్య అమ్రీన్ బేగం (22)కు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇటీవల సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో చేర్పించాడు. ఈమె బెడ్ పక్కన జ్యోతి అనే మహిళ చికిత్స పొందుతుంది. కాగా.. జ్యోతి భర్త నాగరాజు అమ్రీన్ బేగం  కుటుంబ ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని నీకు నెలకు రూ.8 వేల చొప్పున మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. దవాఖాన నుంచి డిశ్చార్జి కాగానే అమ్రీన్ బేగం ఉద్యోగం కోసం నాగరాజును సంప్రదించగా.. అతను పాత బోయిన్పల్లి మల్లికార్జునకాలనీ రోడ్డు నెం.3 లోని సాయి శ్రీనివాస్ అపార్ట్ మెంట్ లోని  ఫ్లాట్ నంబర్ 207కు వెళ్లమన్నాడు. వెంటనే అక్కడికి వెళ్లగా ఇద్దరు మహిళలు ఆమెను వ్యభిచారం చేయాలని, చేస్తేనే డబ్బులు వస్తాయని చెప్పి..బంధించేందుకు యత్నించారు. దీంతో అమ్రీన్బేగం అక్కడి నుంచి తప్పించుకుని భర్త సహాయంతో బోయినపల్లి  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లికార్జునకాలనీలోని గృహంపై దాడి చేయగా, కలకత్తాకు చెందిన ఇద్దరు సెక్స్ వర్కర్లు పట్టుబడ్డారు. వారిచ్చిన సమాచారం మేరకు నిర్వాహాకురాలు సూర్యకుమారిని ఆదుపులోకి తీసుకున్నారు.

Related Posts