YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

జీడీపీలో పెరిగిన భారత్ ర్యాంక్

జీడీపీలో  పెరిగిన భారత్ ర్యాంక్

 యువ్ న్యూస్ జనరల్  బ్యూరో:

నరేంద్ర మోదీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఐదేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లతో నాలుగో స్థానంపై గురిపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు షాక్‌కి గురిచేస్తున్నవి. గడిచిన సంవత్సరానికిగాను ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కలిగిన జాబితాలో భారత్ ప్రస్తుతం ఉన్నస్థానం నుంచి రెండు స్థానాలు కిందకు పడిపోయింది. 2017లో ఐదో స్థానంలో ఉన్న భారత్..ఆ మరుసటి ఏడాదికిగాను ఏడో స్థానానికి పడిపోయింది. ఇదే సమయంలో బ్రిటన్ ఐదోస్థానానికి ఎగబాకగా, ఏడో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ మరో మెట్టుపైకి ఎక్కి ఆరోస్థానానికి చేరుకున్నది. అగ్రరాజ్యం అమెరికా యథావిధిగా 20.5 ట్రిలియన్ డాలర్లతో తన తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నది. భారత్ పొరుగు దేశమైన చైనా 13.6 ట్రిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలువుగా, జపాన్ 5 ట్రిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. గతేడాదికిగాను భారత జీడీపీ 2.7 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇదే సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల ఆర్థిక వ్యవస్థ 2.8 ట్రిలియన్ డాలర్లతో భారత్‌ను అధిగమించాయి. 2017లో దేశ జీడీపీ 2.65 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా..బ్రిటన్ 2.64 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ కంటే బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శణం. గతేడాది ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా, అలాగే ప్రపంచ దేశాల్లో ఐదోస్థానంలో ఉన్నది. దేశీయ కరెన్సీ విలువ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనడం, వృద్ధిరేటు మందగించడం వల్లనే ర్యాంక్ పడిపోయిందని ఇండియా రేటింగ్ అండ్ రీసర్చ్ ప్రధాన ఆర్థికవేత్త దేవేంద్ర పంత్ తెలిపారు.

Related Posts