YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తమిళ నాట కొత్త పొత్తుల కోసం కమలం కసరత్తు

తమిళ నాట  కొత్త పొత్తుల కోసం కమలం కసరత్తు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అంతకుముందు శాసనసభ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో మూడో స్థానంలో నిలిచిన పార్టీ అది. అన్నాడీఎంకే, డీఎంకే తర్వాత స్థానం ఆ పార్టీదే. జయలలిత, కరుణానిధి జీవించి ఉన్నప్పుడే పార్టీ తమిళనాడులో ఒక రేంజ్ లో ఎదిగింది. కానీ తాజాగా పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, నానాటికీ తీసికట్టుగా తయారవుతుందని కేంద్ర నాయకత్వం అభిప్రాయపడుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానమూ దక్కకపోవడాన్ని కేంద్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఇందుకు కారణాలపై కూడా లోతుగా విశ్లేషించారు. 38 లోక్ సభ స్థానాలున్న తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్క స్థానమూ దక్కలేదు. దీనికి ప్రధాన కారణం కమల్ హాసన్ పార్టీయేనని ఒక నిర్ధారణకు వచ్చారు. అనేక చోట్ల కమల్ హాసన్ పార్టీకి చెందిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని పార్టీ అంతర్గత విశ్లేషణలో వెల్లడయింది. బీజేపీ ఓటు బ్యాంకును కూడా కమల్ హాసన్ తన్నుకుపోయారు.ప్రధానంగా యువత ప్రధాని మోదీ పట్ల అన్ని రాష్ట్రాల్లో ఆకర్షితులవుతున్నారు. యువ ఓటర్లు బీజేపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారు. కానీ తమిళనాడులో కమల్ హాసన్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ ఓట్లన్నీ ఆయన పట్టుకుపోయారని అంటున్నారు. మోదీ ప్రభావం తమిళనాడులో పనిచేయకపోవడానికి కమల్ హాసన్ కారణమన్నది పార్టీ అభిప్రాయపడుతుంది. తొలి నుంచి కమల్ హాసన్ మోదీని, భారతీయ జనతా పార్టీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కూడా ఓట్లు పడకకపోవడానికి ఒక కారణంగా చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు శాసనసభలో బీజేపీకి ప్రాతినిధ్యమే లేదు. దీంతో వచ్చే ఎన్నికల సమయానికి బలమైన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తుంది. అన్నాడీఎంకే ను వదిలేసి, డీఎంకే, రజనీకాంత్ పార్టీతో పొత్తుకు సిద్ధమవ్వాలని ఇప్పటికే ఒక ఆలోచనలో కేంద్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో బీజేపీ సభ్యత్వాలు కోటి దాటాలని టార్గెట్ విధించింది. కమల్ హాసన్ దెబ్బకు కుదేలైపోయామన్నది ఆ పార్టీ అంగీకరిస్తుంది.

Related Posts