YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఆఫ్ఘాన్ సరిహద్దులో అమెరికా డ్రోన్ దాడులు

Highlights

  • 20 మంది ఆత్మాహుతి సభ్యులు హతం
  • మృతుల్లో టీటీపీ కమాండర్, ఫిదాయీ శిక్షకుడు
ఆఫ్ఘాన్ సరిహద్దులో అమెరికా డ్రోన్ దాడులు

పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దులో అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి దాదాపు 20 మంది ఆత్మాహుతి సభ్యులు హతమార్చింది.పాక్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఆఫ్ఘాన్ వైపు ఉన్న టీటీపీ ఫిదాయీలు ఉన్న క్యాంపులపై దాడులు చేయడం లేదంటూ అమెరికా, ఆఫ్ఘనిస్థాన్‌లను పాకిస్థాన్ తరచూ నిందిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజా డ్రోన్ దాడి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి టీటీపీ ఫిదాయీలు పాకిస్థాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని తరచూ దాడులు చేస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో తెహ్రీక్-ఇక-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) చీఫ్ ముల్లా ఫజ్‌లుల్లా కుమారుడు సహా 20 మంది పాకిస్థానీ తాలిబన్లు హతమయ్యారు. ఈ విషయాన్ని తాలిబన్ గ్రూప్ నిర్ధారించింది. టీటీపీ క్యాంపుపై జరిగిన దాడిలో ఫజ్‌లుల్లా కుమారుడు అబ్దుల్లా సహా 20 మంది పైటర్లు మృతి చెందినట్టు పేర్కొంది. మృతి చెందిన వారిలో టీటీపీ కమాండర్ అయిన గుల్ ముహమ్మద్, ఫిదాయీలకు శిక్షణ ఇచ్చే యాసీన్‌లు కూడా మరణించినట్టు డాన్ పత్రిక పేర్కొంది.

Related Posts