YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

వెస్ట్ గోదావరిలో డెమో రేప్

వెస్ట్ గోదావరిలో డెమో రేప్

 యువ్ న్యూస్ జనరల్  బ్యూరో:

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఉర్లగూడెంలో దారుణం జరిగింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులతో డెమో రేప్‌ చేయించేందుకు టీచర్లు ప్రయత్నించారు. 1వ తరగతి చదువుతున్న చిన్నారిపై మరో బాలుడితో డెమో రేప్‌ చేయించగా.. బాలికకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉపాధ్యాయులపై దాడి చేశారు. ఇద్దరు ఉపాధ్యాయులు చెరో 80 వేల రూపాయలు కట్టి విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇది డీఈవోకు తెలియడంతో విచారణకు ఆదేశించారు. అప్పటివరకు మరో టీచర్‌ను డిప్యుటేషన్‌పై స్కూల్‌కు పంపారు. మరోవైపు పిల్లలను స్కూల్‌ కి పంపాలంటేనే భయమవుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత టీచర్ ది. పిల్లలు తప్పు చేయకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉంది. అలాంటి టీచర్లే దారి తప్పారు. చేయకూడని పని చేశారు. విద్యార్థులతో టీచర్లు చేయించిన పని తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానికులు వారిపై తీవ్రంగా మండిపడుతున్నారు. వారికసలు మతి ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. అవగాహన పేరుతో ఇలాంటి పాడుపనులు చేయడం ఏంటని సీరియస్ అవుతున్నారు. ఆ ఇద్దరు టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Related Posts