Highlights
- టీఎస్ సెట్ -2018 నోటిఫికేషన్ విడుదల
- 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెస ర్లు, డిగ్రీలెక్చరర్ల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్(టీఎ స్ -సెట్ 2018) నోటిఫికేషన్ ను సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ యాదగిరిస్వామి గురువారం విడుదల చేశారు. మార్చి 14 నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 14వ తేదీ వరకు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 24వరకు, రూ.2000తో మే 4వరకు, రూ.3000తో మే 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెట్ ఎగ్జామ్ జులై 15న నిర్వహిస్తున్నట్లు యాదగిరిస్వామి తెలిపారు. పూర్తి వివరాలకు తెలగాణసెట్.ఓఆర్జీ లేదా ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్సైట్లో చూసుకోవచ్చన్నారు.