
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధనలకు పదును పెట్టేందుకు రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ 2.0 నిధులు ఉపయోగపడుతున్నాయ్. ఈ పథకం ఓయూకి రెండో విడత కింద రూ.107 కోట్లు నిధులను కేటాయించారు. ఈ నిధులతో ఓయూలో 7 పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విద్యార్థులు మెరుగైన పరిశోధనలు చేసేందుకు అవసరమైన ఆధునాతనమైన వసతులను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా హయ్యర్ ఎడ్యుకేషన్‍లో నాణ్యమైన విద్య, పరిశోధనలు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్‌ని ప్రవేశపెట్టింది. మొదటి విడత రుసా 1.0 విజయవంతం కావడంతో రుసా 2.0 పేరిట దేశ వ్యాప్తంగా యూనివర్సిటీలకు విద్యార్థులను మెరుగైన పరిశోధనలకు ఊతం ఇచ్చేలా నిధులు అందజేస్తుంది. రుసా నిధులతో ప్రారంభించిన సెంటర్స్ లలో కొత్తగా సిబ్బందిని నియమించుకోలేదు. ప్రస్తుతం ఉన్న వాళ్లతోనే సెంటర్ల నిర్వహణకు కేటాయిస్తున్నారు. ఆయా డిపార్ట్ మెంట్ల పరిధిలో ఉండే కొన్ని సెంటర్‍ల బాధ్యతలు
ఆయా డిపార్ట్ మెంట్ హెడ్‍లకు అప్పగించారు. ఓయూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో గత 12 ఏండ్లగా విస్తృతమైన పరిశోధనలు సాగుతున్నాయి. దీనికి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ పనిచేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక, సామాజిక అంశాలపై పరిశోధనలకు, చర్చలకు వేదికగా ఉద్దేశించి దీన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ హిస్టరీ, లిటరేషన్, సొసైటీ, ఎడ్యుకేషన్, కల్చర్ తదితర అంశాలపై లోతైన పరిశోధన చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు ఈ కేంద్రంలో అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. డైరెక్టర్ ఫెసర్ యర్లగడ్డ పార్థసారథి ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్రపై పరిశోధనలు జరుగుతున్నాయి.ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ కు ఇచ్చిన ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ కు వచ్చిన ఐడియాలను ప్రొడక్ట్ గా తెచ్చేందుకు మెంటర్స్ ను ఏర్పాటు చేశారు. డైరెక్టర్‍గా శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు.వర్సిటీ, డిగ్రీ కాలేజీల ఫ్యాకల్టీలకు వివిధ అంశాలపై శిక్షణా తరగతులను
నిర్వహించేందుకు వీలుగా ఉన్న ఈ సెంటర్‍ను రూ.3.37 కోట్లతో విస్తరించారు. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జి.రాంరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.రూ.3.67 కోట్లతో సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేశారు. మైక్రో బయాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ భీమా దీనికి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బయోఇథనల్, బయో పాలిమార్, బయోటిస్‍లకు సంబంధించిన ప్రొడక్ట్స్ డెవలప్‍మెంట్‍కు కృషిచేస్తారుఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో దీన్ని ప్రారంభించారు. దీని ఏర్పాటుకు రూ.3.25 కోట్లు కేటాయించారు. డైరెక్టర్‍గా ప్రొఫెసర్ శ్యామల వ్యవహరిస్తున్నారు. ఈ కేంద్రంలలో స్టూడెంట్స్ కు శిక్షణ, వర్క్ షాప్‍లను నిర్వహించడంతోపాటు సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ను అందజేస్తారు.అంబేద్కర్ ఆలోచన విధానాలపై పరిశోధనలు చేసేందుకు వీలుగా ఒక సెంటర్‍ను ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్ చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఓయూ ఓఎస్డీ కృష్ణరావు దీనికి డైరెక్టర్‍గా ఉన్నారు.బయో డైవర్సిటీ పరిశోధన కేంద్రానికి రూ.4.85 కోట్లతో డెవలప్ చేశారు. ఇందులో జీవవైవిధ్యానికి తోడ్పడే చర్యలపై పరిశోధన
చేస్తారు. స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఇందులో పరిశోధన చేసేందుకు కావల్సిన సదుపాయాలను ఏర్పాటు చేశారు. డైరెక్టర్ డాక్టర్ సి. శ్రీనివాస్ పర్యవేక్షణలో స్టూడెంట్స్ పరిశోధనల్లో పాల్గొంటున్నారు