YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆర్టికల్ 370 అధికరణ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం

ఆర్టికల్ 370 అధికరణ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

జమ్ముకశ్మీర్ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం, మరోపక్క ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి నుంచి గెజిట్ నోటిఫికేషన్ వెలువడడం క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. విపక్షాల ఊహకు కూడా అందని విధంగా కేంద్ర ప్రభుత్వం తన కార్యాచరణను పక్కాగా అమలు చేసింది.
       జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా విపక్షాలు ఆందోళనకు దిగారు. అమిత్‌షా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో అమిత్‌షా సభలో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిపై విపక్షాల ప్రశ్నలన్నింటికి తాను సమాధానం ఇస్తానని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విపక్షాలు సభను అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారానే ఆర్టికల్ 370 రద్దు అవుతుందని ఆయన ప్రకటించారు.

Related Posts