YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆర్టికల్ రద్దుతో... స్వయం ప్రతిపత్తి రద్దు

 ఆర్టికల్ రద్దుతో... స్వయం ప్రతిపత్తి రద్దు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

గత కొద్ది రోజులుగా జమ్మూ కశ్మీర్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రం భారీ సంఖ్యలో బలగాలను కశ్మీర్లో మోహరిస్తోంది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్‌ నుంచి యాత్రికులు, పర్యాటకులను వెనక్కి పంపిస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దుకు ప్రతిపాదన చేస్తున్నట్లు అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 గురించి ముఖ్య విషయాలు మీకోసం..
* జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ జమ్మూ కశ్మీర్‌కు వర్తించవు. దీని ప్రకారమే 1965 వరకూ ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు.
* ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
* ఈ ఆర్టికల్‌ను గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. ఆయన అంతకు ముందు జమ్మూ కశ్మీర్ రాజు మహారాజా హరి సింగ్ వద్ద దివాన్‌గా పని చేశారు.

* రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి.
* ఆర్టికల్ 370 ప్రకారం బయటి వ్యక్తులు జమ్మూ కశ్మీర్లో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరదు.

Related Posts