YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ మద్దతు

ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ మద్దతు

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి టీడీపీ మద్దతిచ్చింది. ఈ విషయంలో కేంద్రం తీసుకొన్న నిర్ణయానికి టీడీపీ మద్దతుగా నిలిచింది. ఆర్టికల్ 370 రద్దుపై సోమవారం నాడు టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో మాట్లాడారు.370 ఆర్టికల్ రద్దు వల్ల దేశంలోని  జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలకు మేలు కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.   370 ఆర్టికల్ రద్దును తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఆర్టికల్ 370 తో కాశ్మీర్ ప్రజలకు మేలు జరగలేదని  ఆయన చెప్పారు. కాశ్మీర్ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందని ఆయన చెప్పారు.ఉగ్రవాదం కూడ పెరిగిపోయిందని  టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్  అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకొన్న నిర్ణయానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.2018 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుండి  టీడీపీ బయటకు వచ్చింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో కూడ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో  టీడీపీ బీజేపీతో విభేదించింది.

Related Posts