ఒకే దేశము . ఒకే ప్రధాని. ఒకే రాజ్యాంగం.. కోరుకున్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరడం సంతోషకరమని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ పేర్కొన్నారు.కశ్మీర్ విద్యార్థులు గన్నులతో కాదు ఇక నుండి పెన్నులతో ఉండాలని,రాబోవు రోజుల్లో కాశ్మీర్ గొప్ప సంపన్న రాష్ట్రం కాబోతుందన్నారు.కాశ్మీర్ విద్యార్థుల్లో అమోఘమైన ప్రతిభ ఉందని,ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే ప్రతిపక్ష పార్టీల నేతలు బుద్ధి మార్చుకొని కశ్మీర్ యువత ఎదుగడలకు, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు.కాశ్మీర్ భారతదేశం లో అంతర్భాగం.. ఆ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ స్వాగతిస్తున్నట్లు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా జమ్మూ కాశ్మీర్ లడక్ కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ దేశంలో రాజ్యాంగం ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు నిర్ణయాలన్నీ కూడా కాశ్మీర్ లో అమలు కాబోతుండడం సంతోషకరమైన విషయం ముఖ్యంగా సమాచార హక్కు చట్టం రిజర్వేషన్లు పౌరసత్వం తదితర వంటి అంశాలు కాశ్మీర్ ప్రజలు విద్యార్థులు యువత కల్పించుకోబోతున్నరు. ముఖ్యంగా గా కాశ్మీర్ ప్రాంతానికి చెందిన మహిళను వేరే రాష్ట్రానికి చెందిన ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ మహిళలకు కాశ్మీర్ పౌరసత్వం తొలగింపబడెదీ ఈ విధంగా
అక్కరకు రాని చట్టాలు కాశ్మీర్లో అమలవుతూ చాలామందిప్రజలను యువకులను చట్టాలు ఇబ్బందులకు గురిచెసివి. నిర్ణయం కారణంగా చాలామంది కాశ్మీర్ ప్రజలు సంతోషకరంగా ఉండడం జరుగుతుంది కాశ్మీర్ కొరకు పోరాడి అమరులైన వీర జవాన్ల ఆత్మలు ఈ రోజు సంతోషం వెల్లువెత్తుతున్నాయి. యావత్ భారతదేశం మొత్తం కూడా సంబరాలు చేసుకోవాల్సిన రోజిదన్నారు.