Highlights
- మరికాసేపట్లో మంత్రులతో భేటీ
- ఇప్పటికే చేరుకున్న
- యనమల, కాలువ శ్రీనివాసులు
- ఎన్డీయేలో కొనసాగింపుపై చర్చ
- ఏపీకి ప్రత్యేక హోదాపై
- లోక్ సభలో వాయిదా తీర్మానాన్ని నోటీసు
కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు ఎన్డీయేలో కొనసాగాలా వద్దా అన్న అంశం పై మల్లగుల్లాలు పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక నేతలతో తత్జనభర్జన చేయనున్నారు. ఈ క్రమంలోనే అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలు వెంటనే తన ఇంటికి రావాలని చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. దాంతో మంత్రులు యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులులతో పాటుగా పలువురు నేతలు ఉండవల్లి చేరుకుంటున్నారు. మరికాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్న చంద్రబాబు, గత రెండు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్రంపై తదుపరి దశలో ఎలా వ్యవహరించాలన్న విషయమై చర్చిస్తారని తెలుస్తోంది. కేంద్ర మంత్రుల రాజీనామా, ప్రధాని ఫోన్ అనంతర పరిణామాలను విశ్లేషించనున్న టీడీపీ నేతలు, ఎన్డీయేలో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కుటుంబరావు తదితర నేతలు కూడా హాజరు కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
#TDP gives adjournment motion notice in Lok Sabha over demand for Special Category Status to #AndhraPradesh #budgetsession pic.twitter.com/js0szQX3U2
— ANI (@ANI) March 9, 2018