యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, భారత ప్రభుత్వ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఐరాస తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ ప్రజలకు భారత ప్రభుత్వం కనీస హక్కులు ఇవ్వడం లేదని, అసలు ఐరాస ఏర్పాటు ఎందుకు జరిగిందో తెలియడం లేదని అన్నారు. హక్కుల ఉల్లంఘన ఈ స్థాయిలో ఉన్నా, ఐరాస నిద్రపోతోందని ఆరోపించారు. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఎందుకు ఐక్యరాజ్యసమితి స్పందించట్లేదని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించాలని అఫ్రీది కోరాడు.