యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజకీయాల్లో ప్రత్యర్థుల స్థానం నానాటికీ తగ్గుతోంది. శత్రువుల స్థానాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు రానురాను.. మరింతగా ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఏపీ, తెలంగాణ విష యానికి వస్తే.. రెండు రాష్ట్రాలు అనేక విషయాల్లో ఒప్పందాలు చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకు న్నాయి. ముఖ్యంగా జలాల విషయంలో తాము నిర్ణయించుకున్న మార్గాల్లో వెళ్లాలని అనుకున్నాయి.ఈ నిర్ణయం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి మాట అటుంచి రాబోయే రోజుల్లో జల వివాదాలు పెరుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ, తెలంగాణ సీఎంల ఉమ్మడి శత్రువుగా చంద్రబాబు మారిపోయారు. వాస్తవానికి ఇప్పటికే చంద్రబాబును అటు కేసీఆర్ కానీ, ఇటు జగన్ కానీ రాజకీయ ప్రత్యర్థిగా కన్నా కూడా వ్యక్తిగత శత్రువుగానే చూస్తున్నారు. జగన్ ను మచ్చిక చేసుకుని తన ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడుదాం అనుకుంటూ ఉంటే చంద్రబాబు అడ్డుపడటం నచ్చలేదు. అందుకే జగన్ తో కలిసి టీడీపీని అష్టదిగ్బంధనం చేయాలని ఇద్దరూ ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశా ల్లోనూ వ్యక్తిగత విషయాలకు జగన్ ప్రాధాన్యం ఇవ్వడం ఇందులో భాగమే. రాజకీయంగా అనేక వైరుధ్యాలు ఉన్నప్పటికీ... చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతారు. అయితే, ప్రస్తుతం ఉన్న వాతావరణం మాత్రం చాలా భిన్నంగా తయారైంది. వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ దూకుడు.. ప్రత్యర్థులే ఉండరాదనే మనస్తత్వం వంటి విధానాలతో జగన్ ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును ఏదో ఒక రూపంలో ప్రజల్లో చులన చేసేందు కు ఉన్న అన్ని రకాల మార్గాలను కూడా వినియోగించుకుంటున్నారు. ఈ విషయంలోనే ఆయన చేపట్టిన పను లు, చేసిన ప్రాజెక్టులు వంటి విషయాల్లో అవినీతి జరిగిందని జగన్ ప్రధానంగా ఆరోపించడం వీటిపై విచారణ కు ఆదేశించడం వంటివి జరుగుతున్నాయి. మొత్తంగా ఎలా చూసినా.. రాజకీయంగా చంద్రబాబును ఏకాకి చేసేందుకు ఉన్న అన్ని మార్గాలనూ ఈ ఇరువురు సీఎంలు చూస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వచ్చే ఆరు మాసాల్లోనే ఏదో ఒక పెద్ద చర్య ద్వారా చంద్రబాబును కట్టడి చేయాలనే వ్యూహం పెద్ద ఎత్తున సాగుతోందని హైదరాబాద్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి