YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆర్టికల్ 370 రద్దు పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయన్న రాహుల్

ఆర్టికల్ 370 రద్దు పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయన్న రాహుల్

జమ్మూ కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను నిర్బంధంలో ఉంచి, ఏకపక్షంగా జమ్మూ కశ్మీర్‌ను విభజించడం వల్ల జాతీయ సమగ్రత సాధ్యం కాదని ఆయన తెలిపారు. ఈ దేశం ప్రజలతో నిర్మితమైంది.. మట్టితో కాదని ఆయన ట్వీట్ చేశారు. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని నినదించిన గురజాడ అప్పారావ్‌ను గుర్తుకు తెచ్చారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం పర్యావసనాలు దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాహుల్ హెచ్చరించారు. రాహుల్‌ ట్వీట్ పట్ల చాలా మంది నెటిజన్లు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. బీజేపీకి, కాంగ్రెస్‌కు తేడా ఇదంటూ.. కాంగ్రెస్ నేతలు స్వతంత్రానికి ముందు కశ్మీర్ భారత్‌లో భాగం కాదని మాట్లాడిన వీడియోను.. కశ్మీర్ భారత్‌లో విలీనమైందన్న అమిత్ షా వీడియోను పోస్ట్ చేస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దు పట్ల బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బతికి ఉంటే.. ‘‘వెళ్లి ప్రపంచానికి చెప్పండి, మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేశాడని’’ అనే వారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం పట్ల జమ్మూ కశ్మీర్లోని సామాన్య ప్రజానీకం ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.
నిర్ణయాన్ని సమర్ధించిన సీనియర్ లీడర్
కశ్మీరీలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో... సదరు బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే, బిల్లుకు మద్దతు పలుకుతూ సొంత పార్టీకి చెందిన సీనియన్ నేత జనార్దన్ ద్వివేది చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు షాక్ కు గురయ్యారు. ఓ మీడియా సంస్థతో జనార్దన్ ద్వివేది మాట్లాడుతూ, ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని ఈరోజు సరి చేసినట్టైందని ఆయన వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతికి గురైంది.తనకు స్ఫూర్తిప్రదాత అయిన రామ్ మనోహర్ లోహియా తొలి నుంచి ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూ వచ్చారని... విద్యార్థులుగా ఉన్న తాము ఆయన అభిప్రాయాలపై చర్చించుకునేవారమని ద్వివేది తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం యావత్ దేశం సంతృప్తి చెందే విషయమని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో చేసిన తప్పును ఆలస్యంగానైనా సరి చేశారని కితాబిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని... వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడిస్తున్నానని చెప్పారు.

Related Posts