YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కశ్మీర్ అంశంపై లోకసభలో వాడీ వేడి చర్చ

కశ్మీర్ అంశంపై లోకసభలో వాడీ వేడి చర్చ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

లోక్‌సభలో కశ్మీర్ పునర్విభజన బిల్లును కేంద్రం ప్రవేశపెట్టిన సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మరోసారి ఆంధ్రప్రదేశ్ విభజన అంశం చర్చకు వచ్చింది. కాంగ్రెస్ నేత మనీష్ తివారీ స్పందిస్తూ.. దేశంలో కశ్మీర్ విలీనం వెనుక దశాబ్దాల చరిత్ర ఉందని, బ్రిటిష్ పాలనలోనూ అది స్వతంత్ర సంస్థానంగా ఉందని మనీష్ గుర్తుచేశారు. నెహ్రూ
కృషి వల్లే కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యాయయని కాంగ్రెస్ నేత మనిష్ తివారీ వ్యాఖ్యానించారు. కశ్మీర్ విషయంలో బీజేపీ నియమాలను ఉల్లంఘించిందని, మిగతా రాష్ట్రాలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. రాత్రికిరాత్రే అన్ని నిబంధనలను తోసిపుచ్చి జమ్ముశ్మీర్‌ను విభజించారని కాంగ్రెస్‌ నేత విమర్శించారు.
ద్వైపాక్షిక వివాదంగా ఉన్న అంశం అంతర్గత విషయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తమకు తెలియజేయడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏపీ విభజన అంశంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి ప్రస్తావించారు. మంగళవారం నాడు కూడ అమిత్ షా ఇవే వ్యాఖ్యలను చేస్తూ నాడు జరిగిన పరిణామాలను గుర్తుచేశారు. ఈ సమయంలో వైసీపీ సభ్యులు సైతం మనీష్ తివారీ ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించారని, ఇప్పుడు కశ్మీర్‌ విభజన అన్యాయమని కాంగ్రెస్ వాదిస్తోందని వైసీపీ ఎంపీలు ఎదురుదాడి చేశారు. వైసీపీ ఎంపీలను స్పీకర్ వారించడంతో మనీష్ తివారీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూఏపీ విభజన సమయంలో ఆర్టికల్ 370లోని సెక్షన్ 3 తూ.చ. తప్పకుండా పాటించామని అన్నారు. దీని ప్రకారమే విభజన జరిగిందని స్పష్టం చేశారు. ఏదైనా రాష్ట్రాన్ని విభజించాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన సమయంలో తాము ఈ సంప్రదాయాన్ని పాటించామని మనీష్ తివారీ పేర్కొన్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ లేదని, రాష్ట్రపతి పాలన కొనసాగుతోందని, అలాంటి తరుణంలో ఈ బిల్లును ఎలా తీసుకొస్తారని మనీష్ తివారీ నిలదీశారు. ఇలాంటి సమయంలో కశ్మీర్‌ను విడగొట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన విమర్శించారు. ఒకవేళ కశ్మీరీలకు భద్రతగా బలగాలను పంపుతున్నా, కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసినా దీని వెనుక నాటి జవహర్‌లాల్ నెహ్రూ ఘనత ఉందని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. గత 70 ఏళ్ల కాలంలో కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రాలకు మార్చారు.. కానీ, చరిత్రలో తొలిసారిగా ఓ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేశారని దుయ్యబట్టారు. మరోవైపు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడుతూ.. కీలకమైన కశ్మీర్ పునర్విభజన బిల్లుపై చర్చ జరుగుతుండగా, ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీ ఫారుక్ అబ్దుల్లాను గృహనిర్బంధంలోకి తీసుకున్నారని, దీని వల్ల ఆయన సభకు రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సభలో సభ్యులకు స్పీకర్ రక్షణ కల్పించాలని, ఈ విషయంలో ఆయన తటస్థంగా ఉండాలని కోరారు. డీఎంకేకు చెందిన మరో ఎంపీ టీఆర్ బాలు మాట్లాడుతూ.. కశ్మీర్ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా బిల్లును తీసుకొచ్చారని అన్నారు. అసెంబ్లీ ఉంటనే ప్రజల అభిప్రాయం తీసుకున్నట్టు అవుతుందని, దీని వల్ల బీజేపీ ఏం సాధించిందని ఎంపీ బాలు దుయ్యబట్టారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను నిర్బంధంలోకి తీసుకున్నారని, వారి జాడ కశ్మీర్‌ను జైలుగా మార్చేశారని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత షా తిమ్మిని బమ్మిచేయగల సమర్ధుడని, సంఖ్యా బలంతోనే బిల్లును ఆమోదిస్తామంటే ఎలాగని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోలో పెట్టామని, బిల్లును ప్రవేశపెడితే ఎలాగని, ఎంతో ఘన చరిత్ర కలిగిన కశ్మీర్‌ను ఎలా విభజిస్తారని అన్నారు. సరిహద్దులో ప్రజలు ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు

Related Posts