YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పసిడి ధర తగ్గింపు

 పసిడి ధర తగ్గింపు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.440 పెరుగుదలతో రూ.37,610కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నప్పటకీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.440 పెరుగుదలతో రూ.34,600కు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.44,530 వద్ద నిలకడగా కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.14 శాతం తగ్గుదలతో 1,474 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.27 శాతం పెరుగుదలతో 16.43 డాలర్లకు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరుగుదలతో రూ.36,540కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.450 పెరుగుదలతో రూ.35,350కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. రూ.44,530 వద్ద నిలకడగా కొనసాగుతోంది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts