YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ ఏం చెబుతారో...

మోడీ ఏం చెబుతారో...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేయడంతో పాటు కశ్మీర్ ను రెండుగా విభజిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ 2019, ఆగస్టు 7 బుధవారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు పూర్వాపరాలను వివరించడంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను తన ప్రసంగంలో వెల్లడిస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాని తన ప్రసంగంలో ఏమి వివరిస్తారు.. ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.ఆర్టికల్‌ 370 రద్దును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలో 7న జరిగే అఖిలపక్ష భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగానికి తూట్లు పొడవటమే అని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ విమర్శించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు.జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తి మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యంలో నేడు ఒక దుర్దినం అని.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని విమర్శించారు. పీడీపీ సభ్యులు ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు. పార్టీకి చెందిన నజీర్ అహ్మద్ లావాయ్, ఎంఎం ఫయాజ్ లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ ప్రతులను చింపేశారు. దీంతో వారిని సభ నుంచి బయటకు పంపాలని చైర్మన్ వెంకయ్య నాయుడు మార్షల్స్‌కు ఆదేశాలు ఇచ్చారు. సభ నుంచి బయటకు వచ్చే క్రమంలో ఇద్దరు పీడీపీ సభ్యులు చొక్కాలు చింపుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని బీఎస్పీ, అన్నాడీఎంకే సమర్ధించాయి.

Related Posts