YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చార్ట్ తయారు చేసిన తర్వాత సీట్లు

చార్ట్ తయారు చేసిన తర్వాత సీట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

రైల్వే రిజర్వేషన్ టికెట్ పొందడం మరింత సులువైంది. రిజర్వేషన్ చార్ట్ తయారయిన తర్వాత కూడా టికెట్ పొందే అవకాశం ఏర్పడింది. ఇకపై రైల్లో ప్రయాణిస్తూనే రిజర్వేషన్ బెర్తును ప్రయాణికులు సులువుగా పొందవచ్చు. ఇండియన్ రైల్వేశాఖ చేసిన తాజా మార్పులతో ఇక రైల్వే రిజర్వేషన్ దాదాపుగా గమ్యస్థానం చేరేలోపు ఏదో ఒక కోటాలో బెర్తులు అందరికీ దక్కనున్నాయి. ఆన్‌లైన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ నుంచే ప్రయాణికుడు నేరుగా రిజర్వేషన్ బెర్తులు పొందవచ్చు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రిజిస్టరయి ఉండాలి. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి తిరుపతి ప్రయాణించే వ్యక్తికి హైదరాబాద్ కోటాలో బెర్తు దక్కకపోయినా చార్ట్ తయారయిన తర్వాత మార్గమధ్యలో మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్ కోటాల్లో బెర్తు లభిస్తుంది. ఇది రైలు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రైల్వేశాఖ వందరోజుల ప్రణాళికలో భాగంగా దీన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చింది.  ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి లాగిన్ అయిన తర్వాత కొత్తగా చార్ట్/ వెకెన్సీ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే నేరుగా అన్ని రైళ్లలోని చార్టులు దర్శనమిస్తాయి. ఏ రైల్లో బెర్తు కావాలో ఎంచుకోవాలి. జర్నీ డిటెయిల్స్‌లో రైలు పేరు లేదా నంబరు నమోదు చేయాలి. ఆ తర్వాత బోర్డింగ్ స్టేషన్‌ను ఎంటర్‌చేసిన వెంటనే రైల్లో ఖాళీ బెర్తుల వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్ తరగతుల్లో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలు కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేయగానే సంబంధిత స్టేషన్ కోటాలో ఖాళీగా ఉన్న బోగీ, బెర్తు నంబరు, సైడు, అప్పర్, లోయర్, సైడ్ అప్పర్ బెర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. ఎన్ని బెర్తులు ఖాళీగా ఉన్నాయో కూడా తెలుస్తుంది. అనంతరం పైన కనిపించే బుక్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే బుక్ టికెట్ అని వస్తుంది. అప్పుడు ఐఆర్‌సీటీసీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్‌చేసి డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఇతర వాలెట్‌ల ద్వారా రిజర్వేషన్ టికెట్లు పొందవచ్చు. రిజర్వేషన్ టికెట్ బెర్తుల వివరాలు మెసేజ్ రూపంలో ఫోన్‌కి వస్తుంది. దాన్ని టీటీఈకి చూపించి ఇబ్బందిలేకుండా ప్రయాణించవచ్చు. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్లు చేసుకునే సీనియర్ సిటిజన్ ప్రయాణికులు జాగ్రత్తగా లేకపోతే టికెట్లపై రాయితీని కోల్పోవాల్సి వస్తుంది. పేద, ధనిక తేడా లేకుండా అన్ని వర్గాలు రాయితీలను ఉపయోగించుకోవడంలో జరిగే నష్ట నివారణకు రాయితీలపై ఇటీవల రైల్వేశాఖ ప్రత్యేక ఆప్షన్లు ఇచ్చింది. ప్రస్తుతం 60 ఏండ్లు దాటిన పురుషులకు 40 శాతం, 58 ఏండ్లు దాటిన మహిళలకు 50 శాతం రాయితీ ఇస్తున్నది. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసేప్పుడు రాయితీలు పొందేవారు ఓకే అని, రాయితీలు వద్దనుకునే వారు క్యాన్సల్ అని క్లిక్ చేయాలి. ఇటీవల ప్రయాణికులు ఆప్షన్లు ఎంచుకునే విషయంలో గందరగోళానికి గురై ఒకదానికి బదులు మరొకటి క్లిక్ చేస్తూ రాయితీ కోల్పోతున్నారు. దీని విషయంలో చిన్నపాటి జాగ్రత్త తీసుకుంటే రాయితీని ఉపయోగించుకోవచ్చు.

Related Posts