YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

10 వేలతో జీవన్ అమర్ పాలసీ

10 వేలతో జీవన్ అమర్ పాలసీ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా తన కస్టమర్ల కోసం కొత్త పాలసీని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని పేరు ఎల్ఐసీ జీవన్ అమర్. ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. నాన్ లింక్డ్, ప్రాఫిట్ లేని, కేవలం ప్రొటెక్షన్ ప్లాన్ ఇది. ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్  ఎల్ఐసీ జీవన్ అమర్ పాలసీని ఆవిష్కరించారు. ఈ పాలసీలో రెండు డెత్ బెనిఫిట్స్‌ ఉన్నాయి. పాలసీ తీసుకునే సమయంలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. స్థిర మొత్తానికి పాలసీ తీసుకోవడం ఒక ఆప్షన్. మరొక ఆప్షన్‌లో బీమా మొత్తం పెరుగుతూ వెళ్తుంది. 18 నుంచి 65 ఏళ్లలోపు వయసు కలిగిన వారు జీవన్ అమర్ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ గరిష్ట మెచ్యురిటీ 80 ఏళ్లు. అంటే 80 ఏళ్లు వచ్చేవరకు కూడా ఈ పాలసీని కొనసాగించొచ్చు. 10 ఏళ్ల నుంచి 40 ఏళ్ల కాలపరిమితితో పాలసీ తీసుకోవచ్చు. అలాగే సిగరెట్ తాగే అలవాటు ఉన్న వారికి ప్రీమియం ఒకవిధంగా, అలవాటులేని వారికి ప్రీమియం మరోలా ఉంటుంది. అలాగే మగవారితో పోలిస్తే మహిళలకు తక్కువ ప్రీమియం ఉంది. పాలసీని కనీసం రూ.25 లక్షలకు తీసుకోవలసి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. సింగిల్, రెగ్యులర్, లిమిటెడ్ ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే పాలసీదారుడు మరణిస్తే కుబుంబ సభ్యులకు అందే మొత్తాన్ని ఒకేసారి లేదంటే ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో తీసుకోవచ్చు. పొగ తాగడం అలవాటులేని 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్లకు రూ.కోటి మొత్తానికి పాలసీ తీసుకుంటే.. అతను సంవత్సరానికి రూ.10,800 చెల్లించాల్సి ఉంటుంది. అదే మహిళలు అయితే రూ.9,440 ప్రీమియం కట్టాలి. దీనికి జీఎస్‌టీ అదనం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. ఇది టర్మ్ ప్లాన్. పాలసీదారుడు మరణిస్తేనే బీమా మొత్తం కుటుంబ సభ్యులకు అందుతుంది. లేదంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

Related Posts