యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కర్ణాటక నీటమునిగింది. భారీ వరదలతో చిగురుటాకులా వణికిపోయింది.గతంలో ఎన్నడూ లేని విదంగా భారీ వరదలు కర్ణాటకను ముంచెత్తాయి.భారీగా కురిసిన వర్షాల కారణంగా రహదారులు సైతం చిన్నాబిన్నబయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైన దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కృష్ణా నది పోటెత్తడంతో కర్ణాటక జలాశయాలు నీటితో తొణికిసలాడుతున్నాయి. కొన్నింటిలో సగటు నీటి మట్టానికి చేరువగా నీరు చేరుతుండగా, మరి కొన్నింటిలోకి ప్రమాదకర స్థితిలో నీరు ప్రవహిస్తోంది.కృష్ణ తీవ్రతకు నదీతీర జిల్లాలు వణికిపోతున్నాయి. వరద హోరును తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి యడియూరప్ప ఏరియల్సర్వే నిర్వహించి పరిస్ధితిపై అద్యయనం చేశారు. మరోవైను వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతుందని అధికారులు చెప్పడంతో ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.