
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కాకినాడ: తుని మండలంలోని తేటగుంట తిమ్మాపురం గ్రామంలో కృష్ణుడు గుడి దగ్గరలో నివసిస్తున్న పక్కుర్తి శివకుమారి, భర్త మహాలక్ష్మి, వయసు 28, కులం యాదవ, అను ఆసామి కి సుమారు 9 సంవత్సరాల క్రితం పక్కుర్తి మహాలక్ష్మి, తండ్రి నాగరాజు, వయసు 32,కులం యాదవ అను ఆసామి తో వివాహా మైనట్లు, ఇద్దరు అమ్మాయిలు సంతానం ఉన్నట్లు, పెద్ద అమ్మాయి దేవి వయసు 8, రెండవ అమ్మాయి వయసు 5 సంవత్సరాలు మృతురాలి భర్త మహాలక్ష్మి త్రాగుడికి బానిసైనట్లు మృతురాలు కొంత కాలం నుండి తుని లో బట్టల షాపులో పనిచేస్తున్నట్లు పెద్ద కుమార్తె దేవి మృతురాలి తల్లిదండ్రులవద్ద కాకినాడ లో ఉంటూ చదువు కొంటునట్లు. మృతురాలి భర్త వ్యవసాయ పనులు చేస్తున్నట్లు. భార్య శివ కుమారి కొంత కాలం క్రితం గొర్రెల లోన్ ఇస్తానంటే 40 వేల రూపాయలు కట్టినట్లు లోన్ రాక పోవడంతో డబ్బులు వెనక్కి వచ్చినట్లు ఈ డబ్బులు పెద్దమ్మ అయిన ఆవాల సుబ్బలక్ష్మి కి డబ్బులు ఇచ్చినట్లు. ఈ డబ్బులు విషయమై భార్య భర్త లిద్దరికి ఇద్దరికి గోడవ జరిగి, బుధవారం తెల్లవారు జామున భార్య శివకుమారి ని కొట్టి హత్య చేసి భర్త పరారైనట్లు మృతురాలి తండ్రి ఇసరపు త్రిమూర్తులు తండ్రి నాగరాజు వయసు 50 కులం యాదవ దుర్గమ్మ గుడి దగ్గర పనసపాడు రోడ్, సర్పవరం గ్రామం కాకినాడ రూరల్ అను ఆసామి ఇచ్చిన ఫిర్యాదు పై పెద్దాపురం డి. యస్. పి.శ్రీ అరిటాకుల శ్రీనివాసరావు గారి ఉత్తర్వులు మేరకు తుని రూరల్ సి. ఐ. శ్రీ కె. కిషోర్ బాబు గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు