హర్యానాలో మైనర్లనే లక్ష్యంగా చేసుకొని అఘాయిత్యాలు
- పద్మావత్‌పై నిషేధం బిజీలో ముఖ్యమంత్రి ఖట్టార్
చండీగఢ్ : దేశవ్యాప్తంగా మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిన బీజేపీ పాలిత హర్యానా రాష్ట్రం పేరు ఇప్పుడు జాతీయ వార్తల్లో చర్చనీ యాంశమైంది. లైంగికదాడులతో అట్టుడు కుతున్న ఈ రాష్ట్రంలో ఐదు రోజుల్లో ఆరు లైంగిక దాడి ఘటనలు వెలుగుచూశాయి. ఇం దులో ఫరీదాబాద్ గ్రామంలో గృహిణిపై ఆరుగురు ఆయుధాలతో వచ్చి తన నివాసంలో సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన తాజాది. గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో భర్తతో కలసి ఇంట్లో నిద్రిస్తు న్న సమయంలో లోపలికి బలవంతంగా చొచ్చు కొచ్చిన దుండగులు ఆమెపై దుర్మార్గానికి పాల్ప డ్డారు. భర్త, పక్కింటివ్యక్తి ఆమెను రక్షించేందు కు ప్రయత్నించగా వారిని తీవ్రంగా కొట్టా రనీ, అనంతరం వారిని కూడా పక్కన కట్టేసి వారి కళ్లముందే ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పారు.
10 ఏండ్ల బాలికపై..
పదేండ్ల బాలికపై 48 ఏండ్ల మృగాడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హర్యానాలోని పింజోరీ ప్రాంతంలో ఈ దుర్మార్గ ఘటన చోటుచేసుకుంది. అక్కడితో ఆగని ఆ దుర్మార్గుడు బాలికను చిత్రహింసలకు గురి చేశాడు. ఆమె ప్రయివేటు పార్ట్‌లో కర్రను దూర్చి ఆమెకు నరకం చూపించాడు.
చిన్నారిని అపహరించి..
పానిపట్‌లో 11 ఏండ్ల చిన్నారిని అపహరించుకు వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డారు. ఊరు చివర వివస్త్రగా పడివున్న బాలిక మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పొరుగింట్లో ఉండే ఆ ఇద్దరినీ ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించారనీ పోలీసులు తెలిపారు. ఫరీదాబాద్‌లో మరో ఘటన వెలుగుచూసింది. నడుచుకుంటూ వెళ్తున్న 22 ఏండ్ల మహిళను నలుగురు యువకులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. అనంతరం నడుస్తున్న కారులో ఆ నలుగురు ఆమెపై దుర్మార్గానికి ఒడిగట్టారు. కురుక్షేత్రలో 15 ఏండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేశారు.
పెరుగుతున్న దాడులపై
ఎన్‌సీడబ్ల్యూ ఆగ్రహం
రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న లైంగికదాడి ఘటనలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా డీజీపీతో ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ శుక్రవారం భేటీ కానున్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా గవర్నర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనీ, మైనర్లు, దళితులకు రక్షణ లేకుండాపోయిందని ఆరోపించారు. మరోవైపు పలు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి. లైంగిక దాడుల అంశాన్ని రాజకీయం చేయొద్దని ముఖ్య మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ విజ్ఞప్తి చేసి చేతులుదులుపుకున్నారు.
పద్మావత్‌పై నిషేధం బిజీలో మంత్రులు
ఒకపక్క లైంగికదాడి ఘటనలతో రాష్ట్రం అట్టుడుకుతుండగా.. హర్యానా ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్ర గణం పద్మావత్ సినిమాపై నిషేధం విధించే పనిలో బిజీగా ఉన్నారు. ఆ సినిమాను ఎలా అడ్డుకోవాలనే విషయంపై చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కనపెట్టి... మహిళల రక్షణ విషయంపై దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
లైంగికదాడులు సమాజంలో భాగమే : పోలీసు అధికారి
రాష్ట్రంలో లైంగికదాడి ఘటనలకు నిరస నగా ఒకవైపు ఆందోళనలు జరుగుతుంటే.. మరోపక్క ఉన్నత పదవిలో ఉన్న పోలీసు అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లైంగికదాడులు సమాజంలో భాగమేనని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఏడీజీపీ) వ్యాఖ్యానించారు. 'ఇటువంటి సంఘటనలు ఎప్పటి నుంచో జరుగు తున్నాయి. పోలీసుల పాత్ర ఏమిటంటే.. నేర స్తులను పట్టుకోవడం, నేరాన్ని రుజువు చేయ డం. ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా మేము ఆపాలి' అన్నారు. అయిదు రోజుల్లో ఆరు ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో ఏడీజీపీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.