YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

హఫీజ్ సయిద్ రిలీజ్

హఫీజ్ సయిద్ రిలీజ్

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కశ్మీర్‌పై పాక్ వైఖరి బయటపడుతోంది. హఫీజ్ సయీద్‌ను పోలీసు కస్టడీ నుంచి పాక్ రిలీజ్ చేసింది. ఇతను జమ్మూ కాశ్మీర్‌ను టార్గెట్ చేశాడు. సరైన ఆధారాలు లేవని ఇతడిని విడుదల చేశారు. ముంబై 26/11 బాంబు పేలుళ్ల సూత్రధారిగా సయీద్ ఉన్న సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విభజన, రిజర్వేషన్ల సవరణ బిల్లు, ఆర్టికల్ 370 సవరణ తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించింది. దీనిపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో సయీద్‌ను రిలీజ్ చేయడం చర్చనీయాంశమైంది. 26/11 ముంబై ఉగ్రదాడితో సహా భారత్ లో అనేక ఉగ్రదాడులకు హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా పాల్పడిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ కొంతకాలంగా పాక్ పై భారత్ తీవ్ర వత్తిడి తీసుకొచ్చింది. అంతర్జాతీయంగాను ఒత్తిడి రావడంతో హఫీజ్‌ను పాక్ అరెస్టు చేసింది. నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరు తొలగించాలని సయీద్ చేసిన విజ్ణప్తిని ఐరాస ఇటీవలే తిరస్కరించింది.సయీద్ పై నిషేధానికి ఐరాస 1267 ఆంక్షల కమిటీ ఆమోదం తెలిపింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలతో కఠినంగా వ్యవహరిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో హఫీజ్ 2017, జనవరిలో పాక్ ప్రభుత్వం గృహ నిర్భందం చేసింది. 2001లో భారత పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు కూడా సయీద్‌ను 3 నెలల పాటు గృహ నిర్బంధించింది. తాజాగా హఫీజ్ రిలీజ్‌‌పై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Related Posts