
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘంలో అవినీతికి పాల్పడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టరు పాతిరెడ్డి శంకర్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. కార్యాలయ సమీపంలో ఒక నిర్మాణదారు నుంచి 2.80 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కొత్త ఇళ్లకు పన్నులను ఖరారు చేసే సమయంలో తక్కువ మొత్తంలో పన్ను విధించేందుకు భారీ మొత్తంలో లంచాలను తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఈ క్రమంలో నిర్మాణదారు నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.