
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కె.జయకుమార్ సంచలన తీర్పును వెలువరించారు. చిన్నారిపై హత్యాచారం చేసిన ప్రవీణ్ ను దోషిగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది ఈ అత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
ఈ కేసులో ప్రవీణ్ నేరం చేసినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించింది. ఈ ఏడాది జూన్ 18న తెల్లవారుజామున తల్లి పక్కనే నిద్రపోతున్న శ్రీహితను నిందితుడు ప్రవీణ్ ఎత్తుకెళ్లాడు.
హన్మకొండ లోని రెడ్డి కాలనీలో ఈ ఘటన జరిగింది. నేర ప్రాంతానికి సమీపంలో ఏర్పాటుచేసిన సీసీటీవీలో రికార్డయింది. చిన్నారిని అక్కడి నుంచి తీసుకెళ్లిన ప్రవీణ్ ఆమెపై లైంగికదాడికి దిగాడు. ఈ సందర్భంగా నొప్పి భరించలేక చిన్నారి ఏడస్తుండటంతో గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కేసును విచారించిన కోర్టు కేవలం 48 రోజుల్లోనే దోషికి మరణదండన విధించింది. ఘటనపై ఇంత త్వరగా తీర్పును ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం అవుతోంది. విచారణ లో తానే ఈ నేరం చేశానని నిందితుడు ప్రవీణ్ ఒప్పుకోవడంతో ఉరిశిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.