YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్ సార్వభౌమాదికారం లో జోక్యం తగదు పాక్ కు హితవు పలికిన కేంద్రం ప్రభుత్వం

భారత్ సార్వభౌమాదికారం లో జోక్యం తగదు        పాక్ కు  హితవు పలికిన కేంద్రం ప్రభుత్వం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

‘ఆర్టికల్ 370పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా అంతర్గత వ్యవహారం.  సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం. ఆ అధికార పరిధిలోకి జోక్యం చేసుకోవడం తగదు’ అని కేంద్రం ప్రభుత్వం పాకిస్తాన్ కు  హితవు పలికింది. భారత్‌తో దౌత్య, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను కనిష్ఠ స్థాయికి తగ్గించే నిర్ణయాలపై ఓసారి సమీక్షించుకోవాలని మనదేశం పాకిస్థాన్‌ను కోరింది. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేయడం అంతర్గత వ్యవహారమని వెల్లడిస్తూనే, పాక్‌ తీసుకున్న నిర్ణయాలపై విచారం వ్యక్తం చేసింది.  ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల క్షీణతను  ప్రపంచానికి చూపే ఉద్దేశమే పాకిస్థాన్‌ చర్యల వెనుక ఉద్దేశంగా కనిపిస్తుందని, ఆ దేశం చూపిన కారణాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని అని భారత ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.  ‘జమ్ముకశ్మీర్‌ను అభివృద్ధిలో భాగం చేసే ఉద్దేశంతో భారత ప్రభుత్వం, పార్లమెంటు తాజా చర్యను చేపట్టాయి. దీని వల్ల ఆ రాష్ట్రంలో లింగ, సామాజిక, ఆర్థిక వివక్షను రూపు మాపడానికి మార్గం సుగమం అవుతుంది. ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించడంతో పాటు, జమ్ముకశ్మీర్‌లోని ప్రజల జీవితాలు మెరుగవుతాయి’ అని తన ప్రకటనలో పేర్కొంది. అయితే భారత్  చేపట్టిన ఈ చర్యలను పాక్‌ వ్యతిరేక దృష్టితో చూడటం ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదని చురకలు అంటించింది. ‘ సరిహద్దు ఉగ్రవాదాన్ని సమర్థించుకోడానికి ఈ సెంటిమెంట్లను ఉపయోగించుకుంటుంది’ అని విమర్శించింది. అయితే బుధవారం పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాలపై భారత్ విచారం వ్యక్తం చేస్తుందని ఆ ప్రకటన పేర్కొంది. అలాగే దౌత్య సమాచార మార్పిడి కోసం ప్రస్తుతం ఉపయోగిస్తోన్న మార్గాలను అలాగే కొనసాగించాలని కోరింది. బుధవారం ఇస్లామాబాద్‌లోని భారత రాయబారిని బహిష్కరించడంతో పాటు, దిల్లీలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్న తమ రాయబారి మొయిన్‌ ఉల్‌ హక్‌ను అక్కడికి పంపరాదని పాక్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Related Posts