YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

సంఝౌతాని నిలిపేసిన పాకిస్తాన్

సంఝౌతాని నిలిపేసిన పాకిస్తాన్

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కశ్మీర్ విషయంలో భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందని ఆరోపిస్తోన్న దాయాది దేశం.. దౌత్య సంబంధాలను తగ్గించుకుంటామని ప్రకటించింది. ఇప్పటికే భారత రాయబారిని బహిష్కరించిన పాక్.. వాణిజ్య సంబంధాలను నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని భారత్ కోరింది. కానీ పాకిస్థాన్ మాత్రం తెంపరితనంతో మరికొన్ని దుందుడుకు నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ-లాహోర్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను అర్ధంతరంగా ఆపేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. భద్రతా కారణాలను చూపి పాకిస్థాన్ రైలును ఆపేయగా.. ‘‘నేను రైల్వే మంత్రిగా ఉన్నంత కాలం సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నడపబోం’’ అని పాక్ రైల్వే మంత్రి ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం అని ఆయన తెలిపారు. వాఘా సరిహద్దు వద్ద సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేయడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ దేశంలో భారత సినిమాలను ఆడనీయొద్దని కూడా పాకిస్థాన్ నిర్ణయించింది. 1971 యుద్ధం తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది. దీనికి ప్రకారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను 1976 జూలై 22న ప్రారంభించారు. ఆరు స్లీపర్ కోచ్‌లు, ఒక ఏసీ త్రీ టైర్ కోచ్‌తో ప్రయాణించే ఈ రైలు.. భారత భూభాగంలో ఢిల్లీ నుంచి అట్టారీ వరకు చేరుకుంటుంది. పాకిస్థాన్ వైపు లాహోర్ నుంచి వాఘా వరకు ఈ రైలు నడుస్తుంది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ అట్టారీ రైల్వే స్టేషన్ నుంచి పాకిస్థాన్ బయల్దేరింది. స్టేషన్ మాస్టర్ మాట్లాడుతూ.. సర్వీస్‌ను ఆపేయలేదన్నారు. పాకిస్థాన్ డ్రైవర్, గార్డ్ భారత్‌కు రావడానికి నిరాకరించారు. భారత్ నుంచి ఇంజిన్, సిబ్బంది, గార్డున పంపాలని సందేశం పంపారు. రైలును తీసుకురావడానికి మన వాళ్లు వెళ్తారని ఆయన చెప్పారు.

Related Posts