YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆర్టికల్ రద్దు... అంతర్గత వ్యవహారం... పాకిస్తాన్ కు తేల్చి చెప్పిన భారత్

ఆర్టికల్ రద్దు... అంతర్గత వ్యవహారం... పాకిస్తాన్ కు తేల్చి చెప్పిన భారత్

ఆర్టికల్ 370 రద్దు తమ అంతర్గత వ్యవహారమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్ తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని సూచించింది. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, ఆ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణపై నిర్ణయాలపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్ తో వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకోవాలని ఆ దేశం నిర్ణయం తీసుకుంది. పాక్ తీసుకున్న నిర్ణయాలపై 2019, ఆగస్టు 08వ తేదీ బుధవారం స్పందించింది. పాక్ చర్యల వల్ల జమ్మూ కశ్మీర్ కు నష్టం లేదని..ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత క్షీణిస్తాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. దుష్ర్పచారం చేయడం ఇకనైనా మానుకోవాలని సూచించింది. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై పాక్ తీసుకున్న చర్యలపై అగ్రరాజ్యం తీవ్రంగా స్పందించింది. అత్యుత్సాహం వద్దని పాక్ కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. హద్దుల్లో ఉండాలని సూచించింది. ఆర్టికల్‌ 370 సహా పలు అధికారాలను భారత ప్రభుత్వం రద్దు చేయడంపై పాక్‌ తీవ్రంగా స్పందించింది. భారత్‌తో దౌత్య సంబంధాలు తగ్గించుకోవాలని నిర్ణయించింది. పాకిస్తాన్ లో భారత రాయబారిని బహిష్కరించడమే కాకుండా పాక్ హై కమిషనర్‌ను భారత్‌కు పంపరాదని నిర్ణయించింది. జమ్మూకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయంతో పుల్వామా తరహా ఉగ్రదాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందన్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
పాక్ కు అమెరికా వార్నింగ్
క‌శ్మీర్‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో పొరుగు దేశం పాకిస్థాన్ త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. భార‌త రాయ‌బారిని వెలివేసింది. వాణిజ్య సంబంధాల‌ను కూడా పాక్ తెంచుకున్న‌ది. అయితే ఈ సంఘ‌ట‌న‌ల‌పై అమెరికా ప్ర‌జాప్ర‌తినిధులు స్పందించారు. డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన ఇద్ద‌రు నేత‌లు పాక్‌ను శాంతింప చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఎటువంటి దూకుడు చ‌ర్య‌ల‌కు దిగ‌కూడ‌దంటూ ఆ ఇద్ద‌రు డెమోక్రాట్లు పాక్‌ను కోరారు. స్వ‌దేశంలో ఉన్న ఉగ్ర గ్రూపుల‌ను క‌ట్ట‌డి చేయాల‌ని ఆ డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థులు పాకిస్థాన్‌కు హితువు ప‌లికారు. భార‌త హై క‌మిష‌న‌ర్ అజ‌య్ బిసార‌య్‌ని పాక్ తొల‌గించింది. దీన్ని అమెరికా సెనేట‌ర్ రాబ‌ర్ట్ మెనండేజ్‌, మ‌రో ప్ర‌తినిధి ఈలియ్ ఏంజిల్ ఖండించారు. ఈ ఇద్ద‌రూ అమెరికా విదేశాంగ శాఖ క‌మిటీలో స‌భ్యులే. భార‌త్ అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌ని, ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను ర‌క్షించుకునేందుకు ఆ దేశం చ‌ర్య‌లు తీసుకున్న‌ద‌ని సేనేట‌ర్లు తెలిపారు. పార‌ద‌ర్శ‌క‌త‌, రాజ‌కీయ భాగ‌స్వామ్యం అనేది ప్ర‌జాస్వామ్యంలో భాగ‌మ‌న్నారు.

Related Posts