YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

వరలక్ష్మీకి పులిహోర అంటే ఇష్టం

వరలక్ష్మీకి పులిహోర అంటే ఇష్టం

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వచ్చే వరలక్ష్మీదేవి వరాలు ఇచ్చే దేవత. వరాలు ఇవ్వటమంటే డబ్బు..బంగారం ఒక్కటే కాదు.. మనిషికి ఈ రెండు ఉంటే చాలదు.. ఆరోగ్యం కూడా ముఖ్యం. డబ్బు, బంగారం ఉండి ఆరోగ్యం లేకపోతే ఆ ఇంట్లో ఏమాత్రం సుఖశాంతులుండవు. ఇవి లేకుంటే ధనం ఎంతున్నా అర్థం ఉండదు. ఆరోగ్యం ఉంటే ఆనందం కూడా ఉన్నట్లే.వరలక్ష్మీ పూజ శ్రావణమాసంలో వస్తుంది. వర్షాలు కురుసే కాలం. ఈ కాలంలో తినాల్సిన ఆహార పదార్ధాలతోనే అమ్మవారి ప్రసాదాలు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా బూరెలు, పూర్ణం బూరెలు, బెల్లం, పచ్చి శెనగపప్పు, యాలకులు, మినపప్పు, బియ్యంపిండితో వీటిని తయారుచేస్తారు. వీటితో చేసిన ప్రసాదం వరలక్ష్మీ అమ్మవారికి పెట్టివాటిని ప్రసాదంగా తీసుకుంటే మనస్సుకే కాదు.. శరీరానికి కూడా చాలా మంచి చేస్తుంది. బియ్యం, చింతపండు, నూనె, పల్లీలు, ఆవాలు వంటి పలు పదార్ధాలతో చేసిన పులిహోర అంటే అమ్మవారికి చాలా ఇష్టం. చల్లటి వర్షాకాలంలో మన శరీరానికి వేడి కావాలి. పులిహోర తింటే శరీరానికి వేడి వస్తుంది. అందుకే అమ్మవారి ప్రసాదాల్లో పులిహోరం ఒకటి తప్పనిసరిగా ఉండాలి. పులిహోరలో వాడే ప్రతీ పదార్థం మన శరీరానికి మంచిచేసేవే.  అలాగే దద్దోజ్జనం, ఆవుపాలతో చేసిన పాయసం, బెల్లం చలిమిడి, వడపప్పు, బెల్లం గారెలు, పచ్చి శెనగలు.. పాలకడలిలో పుట్టిన తల్లి లక్ష్మీదేవి.. ఆవిడకు పూజా విధానంలో ఆవుపాలు, నెయ్యితో పూజ చేయాలి. కొబ్బరికాయ, అరటి పండ్లు తప్పనిసరిగా పూజల్లో ఉండాలి..మూడు, ఐదు, తొమ్మిది, పదకొండు ఇలా ఎవరి స్తోమతకు తగినట్లువారు ప్రసాదాలు పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఇంత సంఖ్యలో ప్రసాదాలు పెట్టాలనే నిబంధన లేదు. ఎందుకంటే అమ్మవారు భక్తికి కరుణిస్తారు తప్పా ప్రసాదాలకు కాదు అనేది ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఏ పూజ అయినా భక్తితో చేసి.. శక్తి కొలదీ ప్రసాదం సమర్పిస్తే.. లక్ష్మీ కటాక్షం ఖాయం

Related Posts