యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఎవరూ_ఊహించనంత తొందరగా కాశ్మీర్ సమస్యకి ముగింపు పలకడానికి కారణం ఏమిటే ? BJP మేనిఫెస్టో లో ఉన్న అంశమే! అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డది అని ఖాంగీ ,కమ్మీ ,తుకుడే బాచ్ ల హాహాకారాలు. కొంత మంది మేతావులు ఇంకో అడుగు ముందుకేసి ప్రజాభిప్రాయం తీసుకోవక్కరలేదా అంటూ ఊళలు. కానీ ....విషయం వేరే ఉంది.
గత వారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ USA లో మూడు రోజుల పర్యటన చేసిన సంగతి తెలిసిందే. అమెరికా పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్నది అన్నదీ తెలిసిందే.మరి ఇంత హఠాత్తుగా ట్రంప్,ఇమ్రాన్ ల సమావేశం ఎందుకు ? పాకిస్తాన్ కి ఇచ్చే సైనిక,ఆర్ధిక సహాయం 2016 లోనే నిలిపివేసింది అమెరికా. మీరు ఉగ్రవాదులని అణిచే వరకూ ఆర్ధిక సహాయం పునరుద్హరించే ప్రసక్తే లేదు US సెనేట్ కూడా తేల్చి చెప్పింది. మరి ఈ అత్యవసర సమావేశం దేని గురుంచి ?
ఆఫ్ఘానిస్తాన్ మీద CIA,ఆర్మీ రెండూ కలిసి ఒక సంయుక్త నివేదిక ఇచ్చాయి అధ్యక్షుడు ట్రంఫ్ కి. ఆ నివేదిక సారాంశం ఏమిటంటే ఇన్నేళ్ళ సైనిక చర్య తో ఆఫ్ఘన్ లో పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఇకముందు కూడా వస్తుంది అని అనుకోవడం లేదు. 80 వ దశకంలో అప్పటి సోవియట్ లాగే మన కధ ఉండబోతున్నది. తాలిబన్ లని అంతమొందించడం ,ఆఫ్ఘన్ లో శాంతి ని స్థాపించడం కుదరదు. కాబట్టి తాలిబాన్ నేతలతో చర్చలు జరిపి ఒక అంగీకారానికి వస్తే ఆఫ్ఘన్ నుండి మన సైన్యాన్ని వెనక్కి రప్పించవచ్చు. ముందు ముందు సైనిక చర్యలకి మన డబ్బు వృధా చేయడం ,సైనికులని కోల్పోవడం జరుగుతుంది. పైగా అమెరికన్ ప్రజానీకంలో ఇతర దేశాల రక్షణ కోసం అమెరికన్ సైనికులు ఎందుకు చనిపోవాలి అన్న అసంతృప్తి నానాటికీ పెరిగిపోతున్నది. ఏ విధంగా చూసినా ఆఫ్ఘన్లో మన సైనికులు ఉండడం ఇక ముందు కుదరదు కాబట్టి వేగంగా మన సైనికులని వెనక్కి రప్పించండి.
మరి అమెరికన్ సైనికులని వెనక్కి రప్పించాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటీ ? ఏముందీ ! పాకిస్తాన్ ISI కి తాలిబాన్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కాదు ISI ఏమి చెప్తే అదే చేస్తారు తాలిబన్ నాయకులు.పాకిస్తాన్ ని మధ్యవర్తిగా పెట్టి తాలిబాన్ నేతలు,ఆఫ్ఘన్ ప్రభుత్వ పెద్దలతో ఒక అంగీకారానికి ఒప్పించి మన సైనికులని అక్కడ నుండి రప్పించాలి. ఈ మొత్తం పధకానికి పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉండి పని పూర్తిచేయాలి.
ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం ప్రాంతం అక్కడి ప్రభుత్వ అధీనం లో లేదు. కొన్ని ప్రాంతాలు తాలిబన్ ఆధిపత్యంలోనే ఉన్నాయి. తాలిబన్ అధీనంలో ఉన్న ప్రాంతాలని వాళ్ళే పరిపాలిస్తారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రాంతం అలానే ఉంటుంది. బదులుగా ప్రభుత్వ కార్యాలయాలు,ఆఫ్ఘన్ సైనిక స్థావరాల మీద ఆత్మాహుతి దాడులు చేయకూడదు తాలిబాన్ లు. ఇదీ ఒప్పందం. దీనిని అమలుచేయాల్సిన బాధ్యత పాకిస్తాన్ ది.
ఆఘమేఘాల మీద ఇమ్రాన్ అమెరికా వెళ్ళింది ఇందుకే. రాచ మర్యాదలు లేవు ఒక దేశ అధ్యక్షుడు అమెరికాలో అడుగుపెడితే. చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేశాడు ఇమ్రాన్. ఫేస్బుక్, ట్విట్టర్ లలో ఇమ్రాన్ మీద ట్రోల్లింగ్ జరిగింది.అడుక్కు తినడానికి వచ్చే వాడికి ఘనస్వాగతం ఉండదు అంటూ. కానీ ఇదంతా అమెరికా కనుసన్నలలోనే ఒక పధకం ప్రకారం జరిగింది. ఎక్కడా ప్రచారానికి నోచుకోని ఒక విషయం ఉంది. ఇమ్రాన్ అమెరికన్ పాకిస్తానీలతో ఒక స్టేడియం లో సమావేశం అయ్యాడు పెట్టుబడుల కోసం. 10 వేల మంది హాజరయ్యారు ఆ సమావేశానికి. చిత్రం ఏమిటంటే ఈ సమావేశం విషయం కానీ ,దాని తాలూకు ఫోటోలు కానీ ఎక్కడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు అమెరికన్ అధికారులు.
ఇమ్రాన్ ,ట్రంప్ సమేవేశం కూడా చాలా సాదా సీదాగా జరిగినట్లు సీన్ క్రియేట్ చేశారు. ఇమ్రాన్ ట్రంఫ్ ప్రతిపాదనకి ఒప్పుకున్నాడు. ముందే సమాచారం ఉంది కాబట్టి ఎక్కువ సేపు తర్జన భర్జనలు జరగలేదు. మరి మధ్యవర్తిత్వం చేసినందుకు బ్రోకరేజ్ చార్జీలు ఇవ్వరా ? ఎందుకివ్వరూ ? అమెరికా ఇచ్చిన F-16 విమానాలకి స్పేర్ పార్టుల కొరత తీవ్రంగా ఉంది.ఎంతలా అంటే బాలకోట్ దాడుల తరువాత 80 F -16 లలో కేవలం ఒక స్క్వాడ్రన్ అంటే 16 విమానాలు మాత్రమె యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే మళ్ళీ భారత్ దాడులు చేస్తే ఉన్న 16 విమానాలు కూడా ధ్వంసం అయితే మొత్తానికే చేతులు ఎత్తేయాలి అని 4 నెలలు తమ ఎయిర్ స్పేస్ ని మూసేసింది పాకిస్తాన్.మొత్తం F -16 ఫ్లీట్ ని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని వైమానిక స్తావరాలకి తరలించింది.
మొత్తం 1.3 బిలియన్ డాలర్ల విలువ చేసే F -16 స్పేర్ పార్టుల కోసం ఆర్ధిక సహాయం చేయడానికి ఒప్పుకుంది అమెరికా. బోనస్ గా 2016 వరకూ ఇస్తూ వస్తున్న ఆర్ధిక సహాయం కూడా మళ్ళీ పునరుద్హరించడానికి ఒప్పుకుంది .సంతోషాన్ని బయటపడకుండా పాకిస్తాన్ జాగ్రత్త పడ్డది.
జరుగుతున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు రహస్యంగా సేకరిస్తున్నాడు మన అజిత్ ధోవల్ . ప్రమాద ఘంటికలు మొగబోతున్నాయి అని అత్యవసరంగా ప్రధాని మోడీ ,అమిత్ షా లతో భేటీ అయ్యాడు అజిత్ దోవల్. BJP వాగ్దానం ప్రకారం ఆర్టికల్ 370 ని రద్దు చేయాలి. కానీ అది 2020 లో చేయాలి. కానీ పరిస్థితులు అప్పటిదాకా మనకి అనుకూలంగా ఉండవు. ఎందుకు ? ఆఫ్ఘన్ ,తాలిబాన్ ల మధ్య ఒప్పందం జరిగిపోతుంది ఎందుకంటే అమెరికా కూడా ఆఫ్ఘన్ ప్రభుత్వ పెద్దలకి ఎప్పుడో చెప్పేసారు మేము మీకు ఇంక ఎక్కువరోజు లు రక్షణ ఇవ్వలేము అని. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి వేరే దారి లేదు. శాంతి ఒప్పందం జరిగితే తాలిబాన్ తీవ్రవాదుల కార్యకలాపాలు ఆగిపోతాయి. ఇప్పటివరకూ ఆయుధాలు పట్టుకొని తిరిగిన తాలిబాన్ లకి పని ఉండదు. సో వాళ్ళని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంచి రోజువారీ దాడులు చేయడానికి ISI ముందే ఒప్పించింది ,పైగా అమెరికా నుండి సైనిక సాయం, డాలర్లు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడతాయి . దేనికీ కొరత ఉండదు. కాశ్మీర్ ని అల్ల కల్లోలం చేయడానికి పుష్కలంగా డబ్బు,ఆయుధాలు ,తాలిబాన్ లు ఉంటారు. ఈ సారి ఏదన్నా జరిగితే అమెరికా పాకిస్తాన్ కి అండగా ఉంటుంది ,లేకపోతె శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచి ఆఫ్ఘన్ ప్రభుత్వం మీద దాడులు చేయిస్తుంది పాకిస్తాన్,అప్పటికే అమెరికా సైని కులు వెళ్ళిపోయి ఉంటారు కనుక మొత్తం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇన్నేళ్ళు అమెరికా ఏం ఒరగబెట్టింది అంటూ అంతర్జాతీయంగా విమర్శలు వస్తాయి. సో అమెరికాకి పాకిస్తాన్ ని సమర్ధించడం మినహా వేరే దారి లేదు.
ఇదంతా జరిగాకా 370 ఆర్టికల్ ని రద్దు చేస్తే 1947 లో జరిగినట్లు అదే తరహాలో పశ్చిమ కాశ్మీర్ నుండి ఆజాద్ కాశ్మీర్ పోరాట యోధులుగా తాలిబాన్ తీవ్రవాదులు సరిహద్దులు దాటి భారత్ లోకి చొరబడి విధంసం చేయొచ్చు దానికి పాకి సైన్యం ,ISI వెన్ను దన్నుగా ఉంటాయి పైగా వాళ్ళంతా కాశ్మీర్ విముక్తి కోసం పోరాడుతున్న యోధులుగా ప్రపంచాన్ని నమ్మిస్తుంది పాకిస్తాన్. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇప్పుడే ఆపరేషన్ కాశ్మీర్ ని అమలుచేయాలి . దోవల్ చెప్పినదాన్లో ఏవీ అతిశయోక్తులు లేవు.
యాక్షన్ ప్లాన్ రెడీ అయిపొయింది. ఇమ్రాన్ అమెరికా నుండి ఆనందంగా తిరిగి వచ్చిన రోజే చక చకా ప్లాన్ అమలు చేశారు మోడీ,అమిత్ షా ,అజిత్ దోవల్ లు. అటు ట్రంప్ కి ,ఇటు ISI కి దిమ్మ తిరిగి పోయే సమాధానం ఇచ్చారు. UAPA [Unlawful Activities (Prevention) Act ] ఇప్పుడు కాశ్మీర్ లో కూడా అమలవుతుంది.అంటే ఎవరన్నా దేశ విచ్చిన్నకర తీవ్రవాదులతో ఫోన్ లో మాట్లాడినా , లేదా సంబంధిత రుజువు చేసే ఏ ఆధారం దొరికినా వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులని స్వాధీనం చేసుకోవచ్చు.
ఇప్పుడు అమెరికాని ,పాకిస్తాన్ ని వేధిస్తున్నవి రెండు ప్రశ్నలు. 1.అమెరికా : పాకిస్తాన్ అనుకున్నట్లుగా తాలబాన్ లని శాంతి ఒప్పందానికి ఒప్పిస్తుందా ? 2.ఇప్పుడు శాంతి ఒప్పందానికి తాలిబాన్ నాయకులని ఒప్పిస్తే తరువాత ఖాళీగా ఉండే తీవ్రవాదులని తను భరించగలదా? ఖాళీగా ఉండేవాళ్ళు ఊరుకోకుండా తమ దేశంలో అల్లర్లకి ప్రయత్నిస్తే ?
ఒక మొనగాడు భద్రతా సలహాదారుగా ఉంటె ఎలా ఉంటుందో అటు అమెరికాకి ,ఇటు పాకిస్తాన్ కి సినిమా చూపించాడు అజిత్ దోవల్,దర్శక ,నిర్మాతలు మోదీజీ ,అమిత్ షా లు .